Site icon NTV Telugu

ఓరీ మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికారు రా.. రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా!

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే.. ఈ చిత్రంపై అభిమానులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జక్కన్న స్టోరీ ఏం చూపిస్తాడు..? అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లు ఎలా పోరాడారు..? అసలు వాళ్లిద్దరూ ఎలా కలిశారు..? అంటూ కొన్ని కథలను అల్లుకొని ఇదే స్టోరీఅంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ అనుమానాలపై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ స్పందించింది. తాజాగా ఒక నెటిజన్ అడిగిన అనుమానానికి తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చి నవ్వులు పూయించింది.

“1920లో స్వాతంత్ర సమరయోధులు ఇంటి నుంచి వెళ్ళిపోయి దాదాపు 2 ఏళ్ళ తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్నారు.. ఆ మధ్యలో వారు ఏం చేశారు అనేది రాజమౌళి కథగా తీసుకొని ఈ స్టోరీ రాసుకోవడం లో తప్పులేదు కానీ, మనకు తెలిసిన స్టోరీని కూడా మార్చి చూపించడం ఏంటి అన్నది పెద్ద డౌట్? అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.. దీనికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ స్పందిస్తూ “ఓరీ మీ దుంపలు తెగ. మీరెక్కడ దొరికారు రా..రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా.. క్లియర్‏గా.. మీకు తెలిసిన స్టోరీ సినిమాలో ఉండదు.. మైండ్‏లో నుంచి అవన్ని తీసేసి సినిమాను ఎంజాయ్ చేయండి’ అని అంటూ ఫన్నీగా కౌంటర్ వేశారు. ఇక దీంతో మీమ్స్ తో ‘ఆర్ఆర్ఆర్’ అడ్మిన్ ఆడేసుకుతున్నాడు అంటూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

Exit mobile version