NTV Telugu Site icon

RRR: ఆ ‘పెయిడ్’ కౌంటర్ వాళ్ళకేనా సర్?

Rrr

Rrr

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియా నుంచి ఆస్కార్ వరకూ వెళ్లి, అక్కడ నాటు నాటు పాటకి అవార్డ్ గెలవడం ప్రతి ఇండియన్ కి ప్రౌడ్ ఫీలింగ్ కలిగించింది. కలలో కూడా ఒక ఇండియన్ సినిమా ఆస్కార్ గెలుస్తుందని అనుకోని ప్రతి ఒక్కరికీ ఆర్ ఆర్ ఆర్ స్వీట్ షాక్ ఇచ్చింది. జక్కన్న చెక్కిన ఈ యాక్షన్ ఎపిక్ ఆస్కార్ తెచ్చిన విషయంలో అందరూ హ్యాపీగానే ఉన్నారు కానీ కొంతమంది మాత్రం ఆస్కార్ కోసం అంత ఖర్చు పెట్టారు, ఇంత ఖర్చు పెట్టారు అంటూ కామెంట్స్ చేశారు. ఇది రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ టీం వరకూ వెళ్ళినట్లు ఉంది. డబ్బులు పెట్టి ఆస్కార్ తెచ్చారు అనేలా విమర్శలు చేసిన వారికి ‘పెయిడ్’ కౌంటర్ వేశారు. ఇటివలే టెస్లా కార్స్ నాటు నాటు పాటకి ట్రిబ్యూట్ ఇస్తూ లైట్ షో చేసింది. ఆ లైట్ షో వీడియో సోషల్ మీడియాలో వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతుంది. దీంతో ‘ఎలాన్ మస్క్’ టెస్లా కార్ లైట్స్ వీడియోకి హార్ట్స్ ఇస్తూ ట్వీట్ చేశాడు.

ఒక ఇండియన్ సినిమా గురించి ఎలాన్ మస్క్ లాంటి పర్సన్ ట్వీట్ చెయ్యడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. మస్క్ ట్వీట్ కి ఆర్ ఆర్ ఆర్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ‘వీ పెయిడ్ అవర్ లవ్ టు ఎలాన్ మస్క్’ అంటూ రిప్లై వచ్చింది. ఈ రిప్లైలో ‘పెయిడ్’ వర్డ్ ని ఆల్ క్యాప్స్ పెట్టడం చూస్తుంటే ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కోసం డబ్బులు ఖర్చు పెట్టారు అనే వాళ్లందరికీ కౌంటర్ వేసినట్లు ఉంది. ఆస్కార్ అవార్డ్ కోసం డబ్బులు ఇస్తే ఇప్పుడు ఎలాన్ మస్క్ కి కూడా డబ్బులు ఇచ్చి ట్వీట్ చేయించామా అని అడిగినట్లు ఉంది. మొత్తానికి పెయిడ్ అంటున్న అందరినీ సైలెంట్ చేస్తూ ఆర్ ఆర్ ఆర్ సూపర్ ట్వీట్ చేసింది. అందుకే అంటారు జక్కన్న అంత ఈజీ కాదని.

Show comments