RRR Mania దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా అదే పేరు… రాజమౌళి తన మ్యాజిక్ తో అందరినీ ఫిదా చేసేశాడు. మార్చ్ 25న దేశవ్యాప్తంగా విడుదలైన “ఆర్ఆర్ఆర్” సినిమా గురించే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. నాలుగేళ్ళ తరువాత తమ హీరోలను తెరపై చూసిన ఎన్టీఆర్, చరణ్ అభిమానులు ఫుల్ హంగామా చేస్తున్నారు. థియేటర్లన్నీ హౌస్ ఫుల్ కాగా, పాలాభిషేకాలు అంటూ ఫ్యాన్స్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. మరోవైపు సెలెబ్రిటీలు సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా ఢిల్లీ ఏపీ భవన్ లో కూడా RRR Mania నడుస్తోంది.
Read Also : Actor Vinayakan : మీటూపై అనుచిత వ్యాఖ్యలు… సిస్టర్ అంటూ సారీ చెప్పిన స్టార్
ఢిల్లీ ఏపీ భవన్ లో RRR స్పెషల్ షోలు వేడుకుని వీక్షిస్తున్నారు. ఏపీ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో శనివారం, ఆదివారాలకు గానూ రోజుకు మూడు షోలు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రదర్శిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, ఢిల్లీలో ఉండే తెలుగు ప్రముఖులు ఈ స్పెషల్ షోలను వీక్షించబోతున్నారు. కాగా ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
