Site icon NTV Telugu

“ఆర్ఆర్ఆర్” టీం ఉక్రెయిన్ లోనే మరికొన్ని రోజులు!

RRR

RRR

“ఆర్ఆర్ఆర్” మూవీ షూటింగ్ మరిన్ని రోజులు కొనసాగనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై చిత్రీకరణ జరుగుతోంది. ముందుగా అనుకున్నదాని ప్రకారం ఆగష్టు 12 లోపు షూటింగ్ పూర్తి చేయాలి. కానీ తాజా బజ్ ప్రకారం సినిమా చిత్రీకరణను మేకర్స్ మరో వారం పొడిగించారు. టీమ్ మరో వారం పాటు షూటింగ్ కొనసాగించనుంది. రాజమౌళిని జక్కన్న అంటారు. అంటే సమయం ఎక్కువగా తీసుకున్నప్పటికీ సినిమాను చెక్కి చెక్కి పర్ఫెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు.

Read Also : “ఆర్సీ 15″లో వకీల్ సాబ్ బ్యూటీ

షూట్‌లు, రీషూట్‌లతో సినిమాలో తనకు నచ్చని సన్నివేశాలను మళ్లీ సరిచేస్తాడు. దానిని “ఆర్ఆర్ఆర్” కూడా మినహాయింపు కాదు. అందుకే ఆయన తెరకెక్కించిన అన్ని చిత్రాలూ బ్లాక్ బస్టర్ హిట్స్. ఒక్కటంటే ఒక్క పరాజయం కూడా లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కుటుంబాలతో ఉక్రెయిన్ వెళ్లారు. వారు కూడా రిలాక్స్డ్ మూడ్‌లో ఉన్నారు. రాజమౌళి “ప్యాచ్ వర్క్” కోసం హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే మొత్తానికి సినిమాకు గుమ్మడికాయ కొట్టడానికి మరింత సమయం పడుతున్నమాట. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13, 2021న విడుదల చేయనున్నారు.

Exit mobile version