Site icon NTV Telugu

RRR: దీన్ని మించిన ట్రైలర్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా…

Rrr

Rrr

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఇండియన్ సినిమా గ్లోరీని రిటర్న్ తెస్తాం అని రాజమౌళి ఏ రోజు మాట ఇచ్చాడో తెలియదు కానీ ఆ మాట ప్రతి స్టేజ్ లో నిజం చేస్తూనే ఉన్నాడు. ఇండియన్ సినిమా చేరుకోలేని ప్రతి చోటుకి ఆర్ ఆర్ ఆర్ సినిమా చేరుకుంటుంది దాన్ని మించిన విజయం మరొకటి లేదు. ఇండియాలో 1200 కోట్లు, జపాన్ లో 100 డేస్ గా హౌజ్ ఫుల్ షోస్, గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ సర్కిల్, HCA ఇలా ప్రపంచంలో ఉన్న ప్రతి సినీ అవార్డ్స్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ సినిమా జెండా ఎగారేస్తునే ఉంది. మార్చ్ 12న జరగబోయే ఆస్కార్ వేదికపై బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ తీసుకోని వస్తే అది భారతీయ సినీ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. ఇండియన్ సినిమా గ్రాఫ్ నే మార్చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఏడాది కాలంగా మెస్మరైజ్ చేస్తూనే ఉంది. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణి లాంటి లెజెండ్స్ ది బెస్ట్ కాంట్రిబ్యుషన్ ఇవ్వడంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒక ఎపిక్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. రిలీజ్ అయ్యి ఏడాది గడుస్తున్నా ఆర్ ఆర్ ఆర్ సినిమా మ్యాజిక్ వేవ్ ఫిదా చేస్తూనే ఉంది. ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ మార్చ్ 12న ఉన్న సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ సినిమాని మరో సారి వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి తీసుకోని వస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

మార్చ్ 3న ఆర్ ఆర్ ఆర్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే అనేక వెస్ట్రన్ కంట్రీస్ లో స్పెషల్ షోకి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. టికెట్స్ కూడా సొల్ద్ అవుట్ అవుతున్నాయి, ఇండియాలో కూడా మార్చ్ 3న ఆర్ ఆర్ ఆర్ సినిమా రీరిలీజ్ కానుంది. ఈ రీరిలీజ్ కోసం మేకర్స్ స్పెషల్ ట్రైలర్ ని కట్ చేశారు. స్టీఫెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కమరూన్ లాంటి దిగ్గజ దర్శకులు ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి చెప్పిన మాటలని కోట్ చేస్తూ, ఆర్ ఆర్ ఆర్ సినిమా సాధించిన ఘనతలని గుర్తు చేస్తూ కట్ చేసిన ట్రైలర్, ఒరిజినల్ ట్రైలర్ ని మించి ఉంది. ఫస్ట్ పేస్ లో కట్ చేసిన ఆర్ ఆర్ ఆర్ రీరిలీజ్ ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. మరి మార్చ్ 3న ఆర్ ఆర్ ఆర్ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే నాటు నాటు సింగర్స్ కాళభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లు మార్చ్ 12న ఆస్కార్ అవార్డ్స్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఆ ప్రెస్టీజియస్ స్టేజ్ పైన లైవ్ పెర్ఫార్మెన్స్ తో పాటు చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కూడా నాటు నాటు హుక్ స్టెప్ చేస్తే… సినిమా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా హై ఆన్ ఎనర్జీతో ఊగిపోవడం ఖయాం.

Exit mobile version