RRR: రాజమౌళి మేగ్నమ్ ఒపస్ ‘ట్రిపుల్ ఆర్’ మూవీకి మన దేశం నుండి ‘బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ’ కేటగిరీలో నామినేషన్ లభిస్తుందని సినీజనాల్లో చాలామంది ఆశించారు. మన దేశం నుండి ఆస్కార్ ఎంట్రీ ‘ట్రిపుల్ ఆర్’కు లభించక పోయే సరికి కొందరు తీవ్రస్థాయిలో విమర్శలూ చేశారు. అయితే ‘ట్రిపుల్ ఆర్’కు ఆ ఒక్క విభాగంలోనే కాదు, జనరల్ కేటగిరీలో ఆస్కార్ ఎంట్రీగా పంపే స్థాయి ఉంది. ఎందుకంటే అకాడమీ నిబంధనల ప్రకారం ఓ సినిమాకు ఆస్కార్ ఎంట్రీ లభించాలంటే, సదరు చిత్రం లాస్ ఏంజెలిస్ లో కనీసం సంవత్సరకాలంలో ఓ వారమయినా ప్రదర్శితమై ఉండాలి. ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో లాస్ ఏంజెలిస్ లో కూడా వారానికి పైగానే ప్రదర్శితమయింది. అందువల్ల జనరల్ కేటగిరీలో పలు ఎంట్రీస్ కు ‘ట్రిపుల్ ఆర్’ సిద్ధమైంది. జనరల్ కేటగిరీలో తమ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ కై అప్లై చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.
Sri Satyasai Movie : ‘శ్రీసత్యసాయి అవతారం’ షూటింగ్ ప్రారంభం
జనరల్ కేటగిరీలో ఈ సినిమా – బెస్ట్ ఫిలిమ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే ఒరిజినల్, బెస్ట్ స్కోర్, బెస్ట్ యాక్టర్ విభాగాల్లో నామినేషన్స్ కై తమ చిత్రాన్ని ఎంట్రీగా పంపింది. మరి వీటిలో ఏ యే విభాగాల్లో ‘ట్రిపుల్ ఆర్’కు నామినేషన్స్ లభిస్తాయో చూడాలి.
