ఒమిక్రాన్ అంటూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ సినిమా ఇండస్ట్రీని మరోసారి భయపెడుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మన పాన్ ఇండియా సినిమాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ ఆందోళనలు ఈ సినిమాల రిలీజ్ మరోసారి వాయిదా పడనున్నాయా ? అనే అనుమానాలను రేకెత్తించాయి. అంతేనా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్నరాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ వాయిదా పడుతుంది అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి మరో కారణం కూడా ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్లలో 50% సీటింగ్ ఆక్యుపెన్సీ అంటూ నిబంధనలు విధించడంతో పాటు పలు ఆంక్షలు విధించింది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ టీం మరోమారు వెనకడుగు వేయక తెప్పేలా లేదనే అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి. అయితే ఈ విషయం ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. చిత్ర నిర్మాత డివివి దానయ్య తాజాగా సినిమా విడుదలకు వాయిదా వేయడం లేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ టీం కూడా తాజాగా విడుదల చేస్తున్న అన్ని అప్డేట్స్ లో #RRRonJan7th అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదాపై వచ్చిన రూమర్స్ అన్నింటినీ సైలెంట్ గానే పటాపంచలు చేసినట్టు అయ్యింది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ప్లాన్‌లో ఎలాంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. అంతేకాదు ఒమిక్రాన్ సైతం భయపడేది లేదంటూ ‘తగ్గేదే లే’ అన్నట్టుగా మేకర్స్ ముందుకు సాగుతుండడం ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఇక ఈరోజు సాయంత్రమీ చెన్నైలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
