Site icon NTV Telugu

RRR : గ్రాండ్ ఈవెంట్స్ కన్ఫర్మ్… జక్కన్న స్కెచ్ ఏంటంటే ?

RRR

RRR : ఎట్టకేలకు “రాధేశ్యామ్” మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ రిజల్ట్ సంగతెలా ఉన్నా… చాన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. ఇక ఇప్పుడు అందరూ “ఆర్ఆర్ఆర్” వైపు చూస్తున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌గా విడుదల కానుంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో మరోసారి సినిమా ప్రమోషన్లు చేయడానికి జక్కన్న భారీ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. RRR ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఈ నెల 19న గ్రాండ్ గా జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మేకర్స్ దృష్టి సారించారు.

Read Also : Radhe Shyam : గడ్డకట్టించే చలిలో పూజా, ప్రభాస్ కష్టాలు !

చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నట్టుగానే బుర్జ్ ఖలీఫాలో RRR గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఆందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉండబోతోందట. అంతేకాదు ప్రీ రిలీజ్ వేడుకకు సినిమాలో నటించిన తారలంతా తప్పకుండా హాజరు కావాలని రాజమౌళి చెప్పారట. ఇక ఆ తరువాత అంటే మార్చి 19న బెంగళూరులోని చిక్కబల్లాపూర్‌లో ఓ ప్రమోషనల్ ఈవెంట్ జరగనుంది. ఇక వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న RRR చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా, అలియా భట్, ఒవిలియా మోరిస్, శ్రియ, అజయ్ దేవగన్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version