దర్శక ధీరుడు రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఓలివియా మోరీస్, శ్రియాశరణ్, అజయ్‌దేవ్‌గణ్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. అల్లూరిగా రామ్‌చరణ్, భీమ్‌గా ఎన్టీఆర్ ఆయా పాత్రల్లో ఒదిగిపోగా.. రాజమౌళి తెరకెక్కించిన విధానం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ చిత్రం. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది.
అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డు కొట్టినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఆర్‌ఆర్‌ఆర్ హిందీ డబ్బింగ్ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అప్పటి నుంచి నేటి వరకూ 45 మిలియన్ అవర్స్ ఆర్‌ఆర్‌ఆర్ స్ట్రీమింగ్ అయిందట. అలా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అలాగే ఈ మూవీ మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
