Site icon NTV Telugu

‘బాహుబలి’ బాటలోనే ‘ఆర్ఆర్ఆర్’

RRR

RRR

బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అత్యధికంగా ఎదురు చూస్తున్న తెలుగు చిత్రం నిస్సందేహంగా ‘ఆర్ఆర్ఆర్’. అయితే ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ కూడా ‘బాహుబలి’ బాటలోనే నడవబోతోందని అంటున్నారు. ‘బాహుబలి 2’ వర్కింగ్ స్టైల్‌ను ‘ఆర్ఆర్ఆర్’ కోసం అనుసరించబోతున్నారట. విషయం ఏమిటంటే సినిమా అధికారిక విడుదలకు ముందు పెయిడ్ ప్రీమియర్‌లు వేయబోతున్నారట. దీనికి కారణం ఏమిటంటే… మూవీ విడుదలైన ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్స్ సంపాదించడానికి, అధికారిక విడుదలకు ముందే హైప్‌ని సృష్టించడానికి ఈ స్ట్రాటజీ అన్నమాట. ఈ వ్యూహంతోనే ‘బాహుబలి 2’ ఘన విజయం సాధించింది. టిక్కెట్ ధరలు ప్రారంభ రోజు 500 నుంచి 2000 రూపాయల వరకు ఉన్నాయి. ఈ చిత్రం మొదటి రోజు 120 కోట్ల+ వసూలు చేయడంలో జక్కన్న చేసిన ఈ ప్లాన్ సహాయపడింది.

https://ntvtelugu.com/thaman-strong-counter-to-nani/

ఇక ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ గురించి జనవరి 6 నుండి అంటే విడుదలకు ఒక రోజు ముందు రాత్రి 9 గంటలకు పెయిడ్ ప్రీమియర్‌లను ప్లాన్ చేస్తోందట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే జనవరి 6న సాయంత్రం 6 గంటలకు షోలకు కూడా ప్లాన్ చేయవచ్చు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోని కొన్ని థియేటర్లలో కూడా ప్రీమియర్లు జరగనున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ సినిమా అభిమానులను ఆందోళకు గురి చేస్తోంది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే ప్రధాన నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూలను ప్రకటించాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలలో ఇప్పటికే కర్ఫ్యూ విధించారు. 2022 జనవరి 7న గ్రాండ్ రిలీజ్‌కి అంతా సర్దుకుంటుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు.

Exit mobile version