ఒక హిట్ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడాలి అంటే ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు రాబట్టింది అని లెక్కలు వేసే వాళ్లు. బాహుబలి సీరీస్ తర్వాత హిట్ సినిమా ఎంత రాబట్టింది అనే దాని గురించి మాట్లాడాలి అంటే ‘బాహుబలి సీరీస్’ని వదిలిపెట్టి మాట్లాడాల్సి వస్తోంది. దీంతో ఏకంగా ‘నాన్ బాహుబలి రికార్డ్స్’ అనే కొత్త పేరుని క్రియేట్ చేసుకోని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇలాగే ఇకపై ఒక సినిమా ఎన్ని అవార్డులు గెలుచుకుంది అనే విషయాన్ని మాట్లాడాలి అంటే ‘అవార్డ్స్’ గురించి ‘నాన్-ఆర్ ఆర్ ఆర్ రికార్డ్స్’ అని మాట్లాడుకోవాలేమో. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఆస్కారి బరిలో నిలిచే దారిలో ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ రేస్ లో నిలబెట్టడానికి రాజమౌళి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. జక్కన్న చెక్కిన ఈ మాస్టర్ పీస్ హాలీవుడ్ ఆడియన్స్ తో పాటు, సినీ మేధావులని సైతం ఫిదా చేస్తూ అక్కడి అవార్డ్స్ ని సొంత చేసుకుంటుంది.
రీసెంట్ గా ‘న్యూయార్క్ ఫిల్మ్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్’ని రాజమౌళి గెలుచుకోని సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తాజాగా ఆర్ ఆర్ ఆర్ ఖాతాలో మరో ప్రెస్టీజియస్ అవార్డ్ వచ్చి చేరింది. ‘ఆర్ ఆర్ ఆర్ కాస్ట్ అండ్ క్రూ’ని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ‘స్పాట్ లైట్ అవార్డ్ విన్నర్’గా ప్రకటించింది. ఫిబ్రవరి 24న జరగనున్న HCA ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్ర యూనిట్ కి ‘స్పాట్ లైట్ అవార్డ్’ని ఇవ్వనున్నారు. ఈ అవార్డ్ ఈవెంట్ ని ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అఫీషియల్ యుట్యూబ్ ఛానెల్ లో, ఆపిల్ టీవీలోను లైవ్ చూడొచ్చు. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ ని సొంతం చేసుకోవడం ప్రతి భారతీయ సినీ అభిమానికి గర్వకారణం. ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ అవార్డ్స్ ని అందుకుంటున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ‘ఆస్కార్’ని కూడా అందుకుంటే, ఆ అవార్డుని ఇండియాకి తీసుకోని వస్తే… ఇండియన్ సినిమా హాలీవుడ్ లో జెండా ఎగరేసినట్లే అవుతుంది. మరి ఆ ఘనతని ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా సాదిస్తుందేమో చూడాలి.