Site icon NTV Telugu

ఆకాష్ పూరి “రొమాంటిక్” రిలీజ్ కు ముహూర్తం ఖరారు

Romantic

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ‘మెహబూబా’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ యంగ్ హీరో “రొమాంటిక్” అనే కొత్త సినిమాతో వస్తున్నాడు. సీనియర్ నటి రమ్య కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. కేతికా శర్మ ఈ సినిమాలో కథానాయికగా కనిపించనుంది. అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్‌ లో ఉంటుందని వార్తలు వచ్చాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడాది మేలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో సినిమా ఓటిటి బాట పడుతుంది అంటూ వార్తలు వచ్చాయి.

Read Also : “వరుడు కావలెను” రిలీజ్ డేట్ ఫిక్స్

ఆ తరువాత ఈ ఏడాది జూన్ 18న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల ఆరోజు కూడా సినిమా విడుదలవ్వలేదు. తాజాగా మేకర్స్ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. నవంబర్ 4న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఆకాష్ ఈ సినిమా విజయంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి పోస్టర్లతోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Exit mobile version