NTV Telugu Site icon

KCR: ‘కేసీఆర్’గా రాకింగ్ రాకేష్.. ఇదేం ట్విస్టురా అయ్యా?

Kcr Rocking Rakesh

Kcr Rocking Rakesh

Rocking Rakesh KCR First Look Released:‘జబర్‌దస్త్’ షో తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు డీవోపీ గా పని చేసిన అంజి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూన్నారు. తెలంగాణ ప్రాంతం బంజారా (తాండ) నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ”కేసీఆర్” (కేశవ్ చంద్ర రమావత్) అనే పవర్ ఫుల్ టైటిల్ ను లాక్ చేశారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతులు మీదగా మల్లారెడ్డి యూనివర్సిటీలో 50 అడుగుల కటౌట్ తో 50,000 మంది స్టూడెంట్స్ సమక్షంలో ఈ టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణతో పాటు సినిమా యూనిట్ హాజరయ్యారు.

Super Singer Auditions: హైదరాబాద్‌లో స్టార్ మా సూపర్ సింగర్ ఆడిషన్స్.. అవకాశాన్ని వదులుకోవద్దు

ఈ సినిమాలో అనన్య హీరోయిన్ గా నటిస్తోండగా సీనియర్ నటులు తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్, ధనరాజ్ తో పాటు తాగుబోతు రమేష్, రచ్చ రవి, జోర్దార్ సుజాత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలంగాణ మ్యాస్ట్రో చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు గరుడవేగ అంజి డీవోపీగా కూడా వ్యవహరిస్తున్నారు. బలగం మధు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ సినిమాకి బత్తుల మహేష్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అంజి, కనకవ్వ, రైజింగ్ రాజు, సన్నీ, ప్రవీణ్, లోహిత్ తదితరులు కూడా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏమైనా సంబంధం ఉంటుందా? లేదా? అనేది రిలీజ్ అయితే కానీ చెప్పలేం.