Site icon NTV Telugu

Robert De Niro: రాబర్ట్ డి నిరో ఆగని తపన!

Robbert

Robbert

Robert De Niro: రాబర్ట్ డి నిరో పేరు వినగానే ఆయన విలక్షణమైన నటన గుర్తుకు వస్తుంది. ఈ యేడాది ఆగస్గుతో 80 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న రాబర్ట్ డి నిరో ఇప్పటికీ ఉత్సాహంగా నటిస్తున్నారు. తన అభిమాన దర్శకుడు మార్టిన్ స్కార్సెసే దర్శకత్వంలో ‘ది ఐరిష్ మేన్’లో మరోమారు తనదైన అభినయం ప్రదర్శించారు. ఆ తరువాత మళ్ళీ ఆ స్థాయి నటన కనబరచేందుకు డి నిరోకు తగిన అవకాశం లభించలేదు. ఈ యేడాది కూడా ఆయన వరుసగా ఐదు చిత్రాల్లో నటిస్తున్నారు. అయినప్పటికీ అవేవీ డి నిరో స్థాయికి తగ్గ పాత్రలు కావని చెబుతున్నారు. వీటితో పాటు తానే ఓ సిరీస్ ను నిర్మిస్తూ రాబర్ట్ డి నిరో ఇప్పుడు నటించడానికి సిద్ధం కావడం విశేషంగా మారింది. క్రైమ్ డ్రామాగా రూపొందే “బాబీ మెరిటోరియస్” ఈ వెబ్ సిరీస్ ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.

“టెర్మినేటర్: డార్క్ ఫేట్, కెప్టెన్ ఫిలిప్స్, జెమినీ మేన్” వంటి చిత్రాలకు రచన చేసిన బిల్లీ రే “బాబీ మెరిటోరియస్” ను రాశారు. పైగా ఇందులో రాబర్ట్ డి నిరో నటిస్తూండడంతో ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. ఇందులో డి నిరో టైటిల్ రోల్ ను పోషించడం లేదు. కథలో అత్యంత కీలకమైన “ద సేజ్” అకమండో పాత్రలో డి నిరో కనిపిస్తారు. ఓ ఆఫీసులో జరిగే అన్ని విషయాలను తెలుసుకొని, ఆ సంస్థను నాశనం చేసే పనిలో అకమండో ఉంటాడు. అతడిని ఆపగలిగే శక్తి ఓ మాజీ పోలీస్ ఆఫీసర్ కు ఉంటుంది. ఆ పాత్ర పేరే బాబీ మెరిటోరియస్. సేజ్, మెరిటోరియస్ కీలక పాత్రలు. ఈ రెండింటి మధ్యే అసలైన కథ సాగుతుంది. సేజ్ పాత్ర ఎంతగానో నచ్చడం వల్లే డి నిరో ఈ సిరీస్ నిర్మాణంలోనూ పాలుపంచుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సిరీస్ లో రాబర్ట్ తన అభినయంతో ఏ తీరున అలరిస్తారో చూడాలి.

Exit mobile version