Site icon NTV Telugu

Nandamuri Balakrishna: బాలయ్య ఇంటి గేటును ఢీకొట్టిన వాహనం..

Balayya

Balayya

నందమూరి బాలకృష్ణ ఇంటివద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో బాలయ్య ఇంటి గేటు ధ్వంసమయ్యింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 45 వద్ద ఉన్న బాలకృష్ణ ఇంటివైపుకు ఒక వాహనం దూసుకువచ్చింది. బ్రేకులు సరిగా పడని కారణంగా ఆ వాహనం అదుపుతప్పి బాలయ్య ఇంటి గేటును ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో బాలకృష్ణ ఇంటి గేటు పూర్తిగా ధ్వంసమయ్యింది.

వాహనాన్ని ఒక యువతి నడపడం విశేషం.. అంబులెన్స్ కి దారి ఇచ్చే క్రమంలో వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్నదని , అది తీసే క్రమంలో  వాహనం  బాలయ్య ఇంటి వైపు దూసుకెళ్లిందని ఆమె తెలిపింది. అయితే  ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరుగక పోయేసరికి అంటారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక బాలయ్య ఇంటివద్ద ప్రమాదం జరగడంతో జనం గుంపులు గుంపులుగా చూడ్డానికి ఎగబడ్డారు. ఇక ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని జనాలను అదుపుచేశారు.

Balakrishna

Exit mobile version