RK Roja: తెలంగాణ ఎలక్షన్స్ ముగిసాయి. ప్రస్తుతం ఇప్పుడు అందరి చూపు ఏపీ ఎలక్షన్స్ మీదనే ఉంది. ఇక ఏపీలో మరోసారి తమ విజయకేతనం ఎగురవేయాలని జగన్.. ఈసారి విజయం అందుకోవాలని టీడీపీ, పవన్ కళ్యాణ్ ఎదురుచూస్తున్నారు. ఇక తమతమ పార్టీలను గెలిపించుకోవడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ కు సపోర్ట్ చేస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనవంతు ప్రయత్నం తాను చేస్తున్నాడు. జగన్ బయోపిక్ గా వ్యూహం అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. మొదటి భాగం.. డిసెంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకపక్క ఈ సినిమాను ఆపాలని నారా లోకేహ్స్ పిటిషన్ వేసిన సంగతి తెల్సిందే. అయినా కూడా వర్మ ఎక్కడా తగ్గకుండా వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించాడు. ఇక ఈ ఈవెంట్ కు మినిస్టర్ రోజా ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఇక ఈ వేడుకలో రోజా మాట్లాడుతూ.. ” వ్యూహం చిత్ర వ్యూహకర్త ఆర్జీవీకి నా అభినందనలు తెలుపుతున్నాను. బెజవాడ గడ్డ మీద పుట్టిన ముద్దుబిడ్డ ఆర్జీవీ. శివ నుంచి కంపెనీ వరకూ సినిమాలు తీసి, బెజవాడ నుంచి ముంబై వరకూ తన సత్తాను చూపిన వ్యక్తి వర్మ అని చెప్పాలి. ఆర్జీవీ అంటేనే ఒక సంచలనమని అందరికి తెలుసు. వ్యూహం టైటిల్ ప్రకటించగానే సైకిల్ పార్టీ షేకైపోయింది.. ఆర్జీవీ డైరెక్టర్ అనగానే పచ్చ పార్టీ నేతల ప్యాంట్లు తడిచిపోయాయి. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగిన సంఘర్షణే ఈ వ్యూహం సినిమా. ఎందుకూ పనికిరాని పప్పు లోకేష్ కూడా పవన్ సీఎంగా పనికిరాడని చెప్పాడు. రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి బాబుకి మద్దతు పలికి తనతో పాటు తన వర్గానికి పవన్ వెన్నుపోటు పొడిచాడు. చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశాడు. ఎలాగైనా వ్యూహం సినిమాను ఆపాలనుకుంటున్నారు. అయితే వ్యూహం చిత్రాన్ని ఆపలేరు, 2024లో జగనన్న విజయాన్ని కూడా ఆపలేరు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
