RK Roja Launches Mee Kadupuninda Hotel at Manikonda: సీరియల్ నటి శ్రీవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆమె ఇప్పుడు నటన నుంచి కొత్త అడుగులు కూడా వేస్తూ ముందుకు వచ్చారు. శ్రీ వాణి భర్త, సీరియల్ నటుడు విక్రమాదిత్య ఒక హోటల్ ప్రారంభించారు. ‘మీ కడుపునిండా, తెలుగువారి రుచులు’ అనే హోటల్ ను విక్రమాదిత్య, సందీప్ మిరియాలతో కలిసి ఏర్పాటు చేశారు. ఇక ఈ హోటల్ ను మంత్రి రోజా తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా రోజా మాట్లాడుతూ శ్రీవాణి సీరియల్స్ ద్వారా మనందరికీ తెలిసిన వ్యక్తి అని అన్నారు. శ్రీవాణి, విక్రమాదిత్య, సందీప్ లకు నా శుభాకాంక్షలు మీ కడుపునిండా అనే పేరు ఇంట్రెస్టింగ్ గా ఉంది. మణికొండలో సీనియర్ ఆర్టిస్టులు కానీ యాక్టర్లు గాని ఎంతోమంది ఉంటున్నారు సో ఇక్కడ ఉన్న వారందరికీ అందుబాటులో దగ్గరగా ఉండేలా మీ కడుపునిండా అనే ఈ హోటల్ ను ప్రారంభించారు, వారికి నా శుభాకాంక్షలు అని అన్నారు.
Rashmika: రష్మిక ఆ సీన్లు చేయాలంటే ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాల్సిందేనా?
ఇక ఈ క్రమంలో మీడియాతో ముచ్చటించిన రోజా తనకు నచ్చిన నాన్ వెజ్ వంటకాలు గురించి కూడా బయటపెట్టారు. తనకు రొయ్యల ఇగురు, చేపల పులుసు అనేవి నాకు ఇష్టం అని పేర్కొన్న ఆమె నేను వంట కూడా బాగా చేస్తాను కానీ నేను చేసినది ఎలా ఉందని నా భర్త పిల్లలు చెప్పాలని అన్నారు. ఆ టేస్ట్ ఎలా ఉందనేది చెప్పేది నేను కాదు కదా అంటూ సరదాగా కామెంట్ చేశారు. అలాగే ఈ మీ కడుపునిండా హోటల్ లో వెజ్ నాన్ వెజ్ వంటకాలు అన్నీ కూడా ఆంధ్ర స్టైల్ లో అందుబాటులో ఉంటాయని, అచ్చమైన తెలుగు వంటకాలు ఇక్కడ కచ్చితంగా లభిస్తాయని అన్నారు. సో తెలుగు వారందరూ ఇక్కడకి ఒకసారి వచ్చి టేస్ట్ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.