ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఈ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది సెలెబ్రిటీలను పోగొట్టుకుంది ఇండస్ట్రీ. ఈరోజు ప్రముఖ మలయాళ సీనియర్ నటి కేపీఏసీ లలిత అనారోగ్యంతో కన్నుమూశారు. మరోవైపు ప్రముఖ కన్నడ రేడియో జాకీ రచన మంగళవారం గుండెపోటుతో మరణించారు. రచన జెపి నగర్‌లోని తన నివాసంలో ఛాతీ నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రచన చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.
Read Also : KPAC Lalitha : ఇండస్ట్రీలో మరో విషాదం… సీనియర్ నటి కన్నుమూత
రేడియో జాకీగా దశాబ్ద కాలం పాటు అనుభవం ఉన్న రచన 2000ల మధ్యలో రేడియో మిర్చి 98.3 ఎఫ్‌ఎమ్‌లో తన హాస్యం, అద్భుతమైన నైపుణ్యంతో ‘పోరి టపోరి రచన’గా ప్రాచుర్యం పొందింది. ఇంతకుముందు వరల్డ్ స్పేస్ శాటిలైట్ రేడియోలో పని చేసిన రచన, ఆ వృత్తిని విడిచి పెట్టే ముందు రేడియో సిటీలో కూడా పని చేసింది. శిక్షణ పొందిన సంగీత విద్వాంసురాలు, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు రచన. ఆమె ఊహించని మరణం రేడియో, టెలివిజన్ పరిశ్రమలను దిగ్భ్రాంతికి గురి చేసింది. రక్షిత్ శెట్టి, శ్వేత శ్రీవాస్తవ్ నటించిన బ్లాక్ బస్టర్ కన్నడ రొమాంటిక్ డ్రామా ‘సింపుల్ ఆగ్ ఒండు లవ్ స్టోరీ’ (2013)లో ఆమె ఓ పాత్రలో నటించింది. రచన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.