NTV Telugu Site icon

ఎన్టీవితో ఆర్జే కాజల్ స్పెషల్ ఇంటర్వ్యూ… ‘బిగ్ బాస్ 5’కు రెమ్యూనరేషన్ ఎంతంటే ?

“బిగ్ బాస్ తెలుగు 5” కంటెస్టెంట్ ఆర్జే కాజల్ ప్రీ-ఫైనల్ ఎపిసోడ్ వరకు హౌస్‌లో ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఆమె అభిమానులు సంతోషించే విషయమే అయినప్పటికీ దురదృష్టవశాత్తూ “బిగ్ బాస్ తెలుగు 5” హోస్ట్ నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌లో ఆమెను హౌస్ నుండి బయటకు పంపడంతో టాప్ ఫైవ్ ఫైనలిస్ట్‌లలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే “బిగ్ బాస్ తెలుగు 5” ద్వారా ఆర్జే కాజల్ సంపాదన ఎంతో తెలుసుకోవడానికి బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం ఆర్జే కాజల్ రెమ్యునరేషన్ వారానికి 2 లక్షలు కాగా, 14 వారాలకు గానూ మొత్తం 30 లక్షలు అందుకుందని ప్రచారం జరుగుతోంది. మరి ఆమె ఎంత రెమ్యూనరేషన్ అందుకుంది ? తాజాగా ఎన్టీవీకి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ పంచుకున్న ఆసక్తికర విషయాలేంటో ఈ వీడియోలో చూడండి.

Read Also : ఏపీ టికెట్ ధరలు : హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్