Ritika Singh Responds on Ujjain Rape Case: మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో తాజాగా జరిగిన 12 ఏండ్ల బాలికపై రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అత్యాచారానికి గురైన బాలిక, నడి వీధిలో బట్టలు లేకుండా, రక్తం కారుతున్న ఒంటితో సాయం కోసం ప్రాధేయ పడిన సీసీ టీవీ విజువల్స్ బయటపడడంతో దేశ వ్యాపంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇక తాజాగా నటి రితికా సింగ్ ఉజ్జయిని ఘటనపై స్పందించింది. దేశంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయని అంటూ ఒక సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చింది. దేశంలో ప్రతి రెండు గంటలకు ఏదో ఒక మూలన మహిళలు, అమ్మాయిలు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని వార్తల్లో ఇలాంటి ఘటనలు చూసిన ప్రతిసారి నా ఒంట్లో రక్తం మరుగుతూనే ఉందని అన్నారు.
Chandrabose: ప్రదీప్ చేతుల మీదుగా చంద్రబోస్ కి ఘనంగా సన్మానం
ఈ దారుణాలు ఇంకా ఎప్పుడు ఆగుతాయో? అని ప్రశ్నించిన ఆమె ఇలాంటి అఘాయిత్యాలు ఆగాలంటే, మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే, ప్రతి అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడింది. ఇలాంటి దాడుల గురించి అమ్మాయిలకు ముందుగానే అవగాహన కల్పించాలని, ఒంటరిగా ఉన్నప్పుడు తమను తాము ఎలా కాపాడుకోవాలో చెప్పాలని అన్నారు. చిన్న పిల్లలకు లైంగిక దాడుల గురించి చెప్పాలంటే ఇబ్బందే అయినా, తప్పదని వారి భవిష్యత్ కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి” అని ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె వెల్లడించింది. తెలుగులో గురు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఆమె మరిన్ని సినిమాల్లో కూడా కనిపించింది కానీ అది వర్కౌట్ కాలేదు.