Site icon NTV Telugu

Genelia: మళ్లీ తల్లి కానున్న జెనీలియా అంటూ వార్తలు.. అసలు విషయం ఇదేనట!

Genelia D'souza

Genelia D'souza

Riteish Deshmukh responds to Genelia’s pregnancy rumours: జెనీలియా డిసౌజా అంటే గుర్తు పట్టడానికి కొంత సమయం పడుతుందేమో కానీ బొమ్మరిల్లు హాసిని అంటే తెలుగు ప్రేక్షకులందరూ ఇట్టే గుర్తు పట్టేస్తారు. అలా తెలుగు వారికీ చేరువైన ఆమె తెలుగులో స్టార్ హీరోలతో సైతం నటించి మంచి హిట్స్ ను అందుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తనతో మొట్టమొదటి సినిమా చేసిన బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహమాడి సినిమాలకు బాయ్ చెప్పేసి ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చి వారి ఆలనాపాలనా చూసుకుంటోంది. పిల్లలు స్కూల్ కి వెళ్లే వయసు రావడంతో జెనీలియా, రితేష్ కలిసి మన మజిలీ సినిమాని రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆమె ప్రెగ్నెంట్ అయింది అనే వార్తలు తెర మీదకు వచ్చాయి. తాజాగా ముంబైలో జెనీలియా, రితేష్ ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నారు, ఈ క్రమంలో ఆమె బేబీ బంప్ క్లియర్ గా కనిపించిందని భావించి కొందరు ఆమె ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్ చేశారు.

Mark Antony: ‘మార్క్ ఆంటోనీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. సెప్టెంబర్ 15న రిలీజ్

ఇక ఈ పుకార్లను జెనీలియా భర్త రితీష్ దేశ్‌ముఖ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొట్టిపారేశాడు. జెనీలియా గర్భవతిగా ఉందా అని అడిగే పోస్ట్‌కు రితేష్ స్పందిస్తూ, “ మరో 2-3 పిల్లలు ఉన్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ దురదృష్టవశాత్తు ఇది అవాస్తవం” అని రాసుకొచ్చారు. 2012లో వివాహం చేసుకున్న జెనీలియా, రితీష్‌లకు రియాన్ మరియు రహిల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. జెనీలియా ఇటీవల ఒక ఈవెంట్‌లో తన దుస్తులను తన పొట్టపై మళ్లీ మళ్లీ సర్దుకునే ప్రయత్నం చేయడంతో ఆమె మూడవ గర్భం గురించి ఈ పుకార్లు మొదలయ్యాయి. “బాయ్స్”, “సై”, “బొమ్మరిల్లు”, “ఢీ” సహ “రెడీ” వంటి అనేక తెలుగు బ్లాక్ బస్టర్స్ లో కనిపించిన జెనీలియా తన పెళ్లి తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు.

Exit mobile version