Site icon NTV Telugu

Kanthara : దయచేసి ఇలా మాత్రం కాంతార థియేటర్లకి రాకండి – రిషబ్ శెట్టి విజ్ఞప్తి

Kanthara

Kanthara

కన్నడ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలో తెరకెక్కిన అవైటెడ్ ప్రీక్వెల్ చిత్రం “కాంతార చాప్టర్ 1”. తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనికి ముందు వచ్చిన చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్‌లో అదరగొట్టగా, ముందు భాగంగా వచ్చిన ఈ సినిమా కూడా సాలిడ్ రెస్పాన్స్ అందుకుని వరల్డ్ వైడ్‌గా దూసుకెళ్తుంది. అయితే తాజాగా రిషబ్ శెట్టి ఓ ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు.

Also Read : Rashmika : కన్నడ ఇండస్ట్రీ విమర్శల పై ఘాటుగా స్పందించిన రష్మిక..

థియేటర్లలో సినిమా చూడడానికి వస్తున్న అభిమానులు కొందరు దైవ వేషధారణలో హాజరవుతున్నారని ఆయన గమనించారు. దీనిపై స్పందించిన రిషబ్‌ శెట్టి, “దైవ వేషధారణ మన సంప్రదాయంలో పవిత్రమైనది. దానికి ఉన్న ఆధ్యాత్మికత, భక్తిని గౌరవించాలి. థియేటర్‌ వాతావరణంలో దైవ వేషాలతో ప్రవేశించడం సాంప్రదాయాన్ని వక్రీకరించే చర్యగా మారుతుంది. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. మనం ఆ పుణ్యాన్ని కాపాడుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు. ఇక ‘కాంతారా చాప్టర్ 1’లో కూడా సంప్రదాయాలు, విశ్వాసాల ఆధారంగా కథ నడుస్తున్నందున, ఈ విజ్ఞప్తిని అభిమానులు గౌరవించాలని ఆయన కోరారు. రిషబ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version