NTV Telugu Site icon

Kantara 2: రూ. 5 కోట్లు ఎక్కడ.. రూ. 100 కోట్లు ఎక్కడ.. ఏమన్నా డిమాండా బాబు..?

Risahb

Risahb

Kantara 2: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. చిన్న సినిమాగా కాంతార రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అన్ని భాషల్లోనూ తన సత్తా చాటింది. ఎన్నో అవార్డులను రివార్డులను అందుకుంది. కన్నడ పరిశ్రమను కెజిఎఫ్ ఓ రేంజ్ లో నిలబెడితే .. కాంతార ఆ రేంజ్ ను సుస్థిరంగా మార్చింది. ఈ సినిమా తరువాత కన్నడ ఇండస్ట్రీ రేంజ్ పెరిగింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇక కాంతార సీక్వెల్ ఉంది అని చెప్పిన దగ్గరనుంచి ఎప్పుడెప్పుడు సీక్వెల్ మొదలుపెడతారా..? అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఉగాది నాడు రిషబ్ ఒక తీపి కబురు చెప్పుకొచ్చాడు. కాంతార 2 స్క్రిప్ట్ పనులు మొదలు అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో హమ్మయ్య ఎట్టకేలకు ఈ ఏడాది లోనే షూటింగ్ ముగించేస్తారు అనే ధీమా వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సీక్వెల్ కు రిషబ్ తీసుకుంటున్న పారితోషికమే ఇండస్ట్రీలో హీట్ పుట్టిస్తోంది.

కాంతార సినిమాకు రిషబ్ కేవలం రూ. 5 కోట్లు మాత్రమే తీసుకున్నాడని టాక్ వినిపించింది. చిన్న సినిమా.. అంత పెద్ద సక్సెస్ అవుతుంది అని ఉహించక ఆ రేంజ్ రెమ్యూనిరేషన్ అందుకున్నాడని సమాచారం.ఇక దర్శకుడిగా, నటుడిగా కూడా ఒకే రెమ్యూనిరేషన్ తీసుకున్న రిషబ్.. కాంతార 2 కోసం కళ్ళు చెదిరే రెమ్యూనిరేషన్ పట్టేశాడని టాక్. ఒకట్లలో కాదు వందల్లో ఈసారి పారితోషికం డిమాండ్ చేశాడట. అందుతున్న సమాచారం ప్రకారం కాంతారా 2 కోసం రిషబ్ 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. రూ 50 కోట్లు పారితోషికం రూపంలో.. మారో రూ. 50 కోట్లు బిజినెస్ లో షేర్ లాగా తీసుకుంటున్నాడట. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ, ఒకవేళ నిజమైతే మాత్రం రిషబ్.. యష్ ను మించిపోయాడనే చెప్పొచ్చు. రూ. 5 కోట్లు ఎక్కడ.. రూ. 100 కోట్లు ఎక్కడ సామి అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.