Kantara 2: ‘కాంతార 2’ కథ పూర్తయ్యింది… ఇక ఆరంభమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది రిలీజ్ అయిన కాంతార సినిమాపై ఆడియెన్స్ వసూళ్ల వర్షం కురిపించారు. కెజియఫ్ తర్వాత హోంబలే ఫిల్మ్స్ కి భారీ విజయాన్ని ఇచ్చింది కాంతార. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో ఒక రీజనల్ సినిమాగా తెరకెక్కిన కాంతార, ముందుగా కన్నడ భాషలో మాత్రమే రిలీజ్ అయ్యింది. అక్కడి హిట్ టాక్, క్లాసిక్ స్టేటస్ అందుకోవడంతో కాంతార సినిమా బౌండరీలు దాటింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 450 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి కాంతార సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెచ్చే క్లైమాక్స్ కాంతార సినిమా చూపించింది. ఒక కొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాంతార సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాంతారకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్ వస్తుంది అంటూ రిషబ్ శెట్టి స్టేట్మెంట్ ఇవ్వడంతో, ఫాన్స్ వెయిటింగ్ మరింతగా పెరిగింది. ఇప్పటికే కాంతార 2 స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలయ్యింది. ఈ క్రమంలో కాంతార ప్రీక్వెల్ గురించి లేటెస్ట్ అప్టేడ్ ఒకటి వైరల్‌గా మారింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కాంతార 2 స్క్రిప్ట్ మొదటి డ్రాఫ్ట్ ఫైనల్ రెడీ అయ్యిందని తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో రిషబ్ ఫుల్ హ్యాపిగా ఉన్నాడట. త్వరలోనే స్క్రిప్ట్‌ని లాక్ చేయనున్నాడని KFIలో వినిపిస్తున్న మాట. మేకర్స్ స్క్రిప్ట్ వర్క్ తో పాటు కాస్ట్యూమ్, లోకేషన్ ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతం చేస్తున్నారట. ఇప్పటికే కోస్టల్ కర్ణాటకలో కొన్ని లోకేషన్స్‌ను ఫైనల్ చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని, అనౌన్స్మెంట్ నుంచే పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా కాంతార 2 ప్రమోషన్స్ జరుపుకోనుందని కన్నడ మీడియా ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తోంది. కాంతార సినిమా రాబట్టిన క్రేజ్‌తో.. మేకర్స్ ఈ ప్రీక్వెల్‌ని భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. హీరోగా, దర్శకుడిగా రిషబ్ వంద కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడని సమాచారం. మరి కాంతార2 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
- Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
తాజావార్తలు
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!