Site icon NTV Telugu

Richa Chadha: సౌత్ ఇండస్ట్రీపై ‘షకీలా’ భామ సంచలన వ్యాఖ్యలు..

Richa Chadha

Richa Chadha

ప్రస్తుతం బాలీవుడ్ చూపు మొత్తం టాలీవుడ్ మీదే ఉంది అంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ లో ఒక్కో సినిమా యావరేజ్ అనిపించుకోవడానికే కష్టపడుతుంటే సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాలను అందుకొంటున్నాయి. దీంతో హిందీ తారలు.. సౌత్ ఇండస్ట్రీపై తమ కోపాన్ని వెళ్ళగగ్గుతున్నారు. గత కొన్నిరోజులుగా నార్త్- సౌత్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ వివాదం గురించి బోల్డ్ బ్యూటీ తనదైన రీతిలో స్పందించింది. ‘షకీలా’ బయోపిక్ తో తెలుగువారిని సైతం తన అందచందాలతో ఆకట్టుకున్న హాట్ బ్యూటీ రిచా చద్దా సౌత్ సినిమాలు భారీ కలెక్షన్లను సాధించడంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ..” సౌత్ సినిమాల టికెట్స్ రేట్లు రూ. 100 నుంచి 400 లోపు మాత్రమే ఉంటాయి. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు పెరుగుతూ ఉంటాయి.. చిన్న సినిమాలు వచ్చినప్పుడు తగ్గుతూ ఉంటాయి. ఇక తమ అభిమాన హీరోల సినిమాలు కాబట్టి అభిమానులు ఎంత రేట్ ఇచ్చి అయినా కొని సినిమా చూస్తారు. ఎందుకంటే అక్కడ ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉంటుంది. అందుకే వారికి భారీ ఓపెనింగ్స్ వస్తాయి. కానీ బాలీవుడ్ లో అలా కాదు.. సినిమా ఏదైనా టికెట్ ధర రూ. 500 పైనే ఉంటుంది. అందుకే ప్రేక్షకుడు టికెట్ కొని సినిమా చూడడానికి ధైర్యం చేయడు. ఇక ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమా పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఆ డబ్బుతో ఇంట్లో సరుకులు తెచ్చుకోవచ్చని మధ్యతరగతి వారు ఆలోచిస్తారు. బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూటర్స్ అత్యాశ వల్ల హిందీ సినిమా నష్టపోతోంది. సినిమా నిలదొక్కుకోవాలంటే వ్యాపారంలో పెద్ద వాటాదారులు బాధ్యత వహించాలి” అని రిచా అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version