Site icon NTV Telugu

RGV: పవన్ కళ్యాణ్ నా పోస్టర్ ను కాపీ కొట్టాడు…

Varma

Varma

RGV: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండకపోతే వర్మకు నిద్రపట్టదు. ఇక ఈ మధ్య పాలిటిక్స్ లో యమా యాక్టివ్ గా ఉంటున్న వర్మ .. జగన్ కు మద్దతు ఇస్తూ.. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను ఏకిపారేస్తున్నాడు. ఇక ఈ మధ్యనే వ్యూహం అనే సినిమా తీస్తున్నట్లు తెలిపి షాక్ ఇచ్చాడు. జగన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో జగన్ జైలుకు వెళ్లడం దగ్గరనుంచి ఆయన పాదయాత్ర.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలు.. అన్ని చుపించానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ లో కూడా జగన్ కోణంలోనే చూపించినట్లు తెలుస్తోంది.

Keerthy Suresh: మహానటి బాలీవుడ్ ఎంట్రీ.. సమంత హీరోతో రొమాన్స్.. ?

ఇక గత రెండు రోజుల నుంచి నారాచంద్ర బాబు నాయుడు అరెస్ట్ పై రాష్ట్రం అంతా అట్టుడికిపోతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత రాత్రి పవన్ కళ్యాణ్ ను విజయవాడ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఎలాగైనా విజయవాడ వెళ్లాలని పవన్ పట్టుబట్టి రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేసిన విషయం కూడా తెలిసిందే. తాజాగా పవన్ అలా పడుకొని వ్యూహంలోని తన ఫోటోను కాపీ కొట్టాడని వర్మ ఆరోపించాడు. వ్యూహం ట్రైలర్ గమనిస్తే.. అందులో పవన్ పాత్రధారి నేలపై పడుకొని కాలుమీద కాలు వేసుకొని ఆలోచిస్తూ కనిపిస్తాడు. రాత్రి పవన్ సైతం నడిరోడ్డుపై పడుకొని కాలు మీద కాలువేసుకొని పోలీసులతో వాదిస్తూ కనిపించాడు. ఈ రెండు ఫోటోలను పక్కపక్కన పెట్టి.. “పైన నేను నెల క్రితం రిలీజ్ చేసిన “వ్యుహం” సినిమా ఫొటో.. కింద నిన్న రాత్రి రోడ్డు మీద తీసిన రియల్ ఫోటో” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version