NTV Telugu Site icon

RGV: చిరంజీవికి పద్మ పురస్కారం.. సంతోషంగా ఉన్నట్లు నటిస్తాను

Rgv

Rgv

RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదం లేకపోతే వర్మకు నిద్రపట్టదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ మధ్య సినిమాలను పక్కన పెట్టి.. ట్విట్టర్ లో వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. అందరికి నచ్చిన ఏ పని వర్మకు నచ్చదు. ఇక నిన్నటికి నిన్న మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇండస్ట్రీ మొత్తం చిరుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక చిరుకు కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. అయితే అందులో కూడా చిరును తప్పుగా ట్యాగ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

” శ్రీ పద్మా సుబ్రహ్మణ్యం లేదా శ్రీ బిందేశ్వర్ పాఠక్ గురించి నేను ఎప్పుడూ వినలేదు మరియు వారిని మెగా స్టార్‌తో సమానమైన స్థితిలో ఉంచడానికి, నేను అవార్డుతో థ్రిల్‌గా లేను, అయితే చిరంజీవి గారికి సంతోషంగా ఉంది అంటే నేను కూడా సంతోషంగా నటిస్తాను” అని రాసుకొచ్చాడు. ఇక చిరు ట్విట్టర్ @kchirutweets కి బదులు @chirutweets అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే వర్మ ప్రస్తుతం జగన్ బయోపిక్ వ్యూహం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో వర్మ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments