NTV Telugu Site icon

RGV: ఏపీ ప్రజలపై ఆర్జీవీ ఫైర్.. వెన్నుపోటు పొడుస్తున్నారు అంటూ..

Varm

Varm

RGV: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హీట్ ఎక్కిస్తున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడంతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. టీడీపీ నాయకులు, అభిమానులు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో కోర్టు చంద్రబాబు నాయుడుకు 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెల్సిందే. ఇక చంద్రబాబు అరెస్ట్ ను టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇంకోపక్క చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో వైసీపీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. ఆయన చేసిన స్కామ్ కు తగిన శిక్ష పడుతుందని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఇక ఈ బంద్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది బంద్ గురించి ఆలోచించకుండా ఏపీ ప్రజలు చంద్రబాబుకు గట్టి వెన్నుపోటు పొడుస్తున్నారని ఫైర్ అయ్యాడు.

Jr NTR: ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్రాండ్..

“మై నాట్ డియర్ ఏపి ప్రజలారా, నలభై సంవత్సారాల నుంచి ఓక్క రూపాయి కూడా ఆశించకుండా మీకు పగలు రాత్రి సేవ చేసిన వారిని , లోపలికేసినందుకు బంద్ కి పిలిస్తే , ఏ మాత్రం కేర్ చెయ్యకుండా మీ పనులు చేసుకుంటూ , సినిమాలు చూసుకుంటూ, షాపింగ్లు చేసుకున్నారా ??? అవ్వ !!!ఇంత కన్నా వెన్నుపోటు వుంటుందా?” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై ఏపీ ప్రజలు సైతం మండిపడుతున్నారు. నువ్వే చెప్పాలి ఇలాంటివి అని కొందరు.. ఇలా మాట్లాడం తప్పు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

https://x.com/RGVzoomin/status/1701407236613132346?s=20

Show comments