వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పైగా సీన్ లోకి కేఏ పాల్ ను లాగాడు వర్మ. సాధారణంగానే పవన్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేసే వర్మ ఇటీవల “భీమ్లా నాయక్” బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భంగా మూవీ ఉరుములు, మెరుపులు అంటూ పవర్ స్టార్ ను పొగుడుతూ ట్వీట్ చేసి అందరికి షాకిచ్చాడు. అయితే ఆర్జీవీ చేసిన ఆ ట్వీట్ పాజిటివ్ గానా? నెగెటివ్ గానా ? అనే విషయం చాలామందికి అసలు అర్థం కాలేదనే చెప్పాలి. ఇక తాజాగా “హే పవన్ సర్ కాబోయే పీఎం చెప్తున్నాడు విను” అంటూ పవన్ కళ్యాణ్ గురించి కేఏ పాల్ చేసిన కామెంట్స్ కు సంబంధించి ఓ వీడియోను షేర్ చేశారు.
Read Also : Radhe Shyam on Metaverse : ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డు… యూనిక్ వెర్షన్ లో మూవీ
ఆ వీడియోలో “పవన్ కళ్యాణ్ ముఖ్యమంతి కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా… పవన్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా… ఒక్క పర్సంట్ నీతి నిజాయితీ ఉన్నా పవన్ కళ్యాణ్ ను ప్రజా శాంతి పార్టీలో చేరమని చెప్పండి. 42 మంది ఎంపీలను గెలిపించుకుని, మీరు ఎస్ అంటే నేనే ప్రధాన మంత్రిగా ఉంటాను. పవన్ కళ్యాణ్ ను కావాలంటే ఏపీకి సీఎంని చేద్దాం. తప్పేముంది ?” అంటూ ఆవేశంగా ప్రసంగం చేయడం కన్పిస్తోంది.
