Site icon NTV Telugu

RGV: ఎలా ఉండే పిల్లను ఎలా మార్చేసావ్ వర్మ.. చీరలో ముద్దుగా ఉండేది.. ఇప్పుడేమో విప్పేసి..

Aaradya

Aaradya

RGV: ఒక నార్మల్ సాదాసీదా అమ్మాయిలను స్టార్ సెలబ్రిటీగా చేయగల దమ్మున్న డైరెక్టర్ ఎవరు అంటే ఆర్జీవి అని చెప్పొచ్చు. సినిమాల వల్లనే అమ్మాయిలు సెలబ్రిటీలు అవుతారు అనుకోవడం అందరికీ తెలిసిందే. కానీ, ఆర్జీవి కంట్లో పడిన అమ్మాయి హీరోయిన్ కాకముందే సెలబ్రిటీగా మారుతుంది. ఇప్పటికే ఆర్జీవి కంట్లో పడిన ప్రతి ఒక్క అమ్మాయి సెలబ్రిటీగా కొనసాగుతుంది. ఇక ఈమధ్యనే శారీ గర్ల్ అని ఒక అమ్మాయి నచ్చిందని చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. ఆమె పేరు ఆరాధ్య దేవి. ఇక ఆమె గురించి చెప్తూ.. ఆమెతో ఒక సినిమా తీయాలని ఉందని కూడా చెప్పుకొచ్చాడు. చెప్పినట్లే ఆమెతో సినిమా తీశాడు వర్మ. శారీ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అప్పట్లో ఆమె శారీ కట్టుకున్న ఫోటోలను షేర్ చేసిన వర్మ.. ఇప్పుడు ఆమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేశాడు. అందులో ఆమె గ్లామర్ ఒలకబోస్తూ కనిపించింది.

ఇక ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ” ఇవి కేరళకు చెందిన ఆరాధ్యా దేవి అనే అమ్మాయి ఫోటోలు, Rgv డెన్‌లోని బృందం ఒక ఇన్‌స్టా రీల్‌లో కనుగొని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తమ చిత్రం శారీ కోసం సంతకం చేసింది. ఫోటోగ్రాఫర్ యశ్వంత్ చేసిన ఫోటో షూట్ ఇది. చాలా అద్భుతంగా ఉన్నాయి కదూ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఫొటోల్లో ఆరాధ్య నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పోజింగ్ తో అదరగొట్టింది. బ్లాక్ కలర్ టాప్.. జీన్స్ షార్ట్ తో కొన్ని.. వైట్ టాప్ లో ఎద అందాలను ఆరబోస్తూ ఇంకొన్ని ఫోటోలు అదిరిపోయాయి. ఎలా ఉండే పిల్లను ఎలా మార్చేసావ్ వర్మ.. చీరలో ముద్దుగా ఉండేది.. ఇప్పుడేమో విప్పేసి.. చూపిస్తుంది. శారీ గర్ల్ అని నువ్వు ఎంకరేజ్ చేయకపోతే.. ఆమె అలానే చీరలో ఇంకా అందంగా కనిపించేది కదా అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version