Shiva Re-Release : నాగార్జున హీరోగా ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన శివ మూవీ 14 నవంబర్ 2025న రీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ కోసం ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. తాజాగా ఆర్జీవీ, నాగార్జున కలిసి స్పెషల్ గా ఓ ఇంటర్వ్యూ లాంటిది నిర్వహించారు. వీరిద్దరూ చిట్ చాట్ లాగా చాలా మాట్లాడుకుంటూ చాలా విషయాలను పంచుకున్నారు. శివ సినిమాను నిర్మిస్తున్నప్పుడు సౌండ్ లేదని.. నటీనటులు చాలా స్లోగా మాట్లాడుకుంటున్నారని అన్నారని నాగార్జునకు డైరెక్టర్ ఆర్జీవీ తెలిపాడు.
Read Also : Spirit : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్పిరిట్ పై సందీప్ రెడ్డి అప్డేట్..
ఇలా వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. శివ సినిమా ఎలా మొదలైంది, ఆ సమయంలో ఎదురైన సవాళ్లు, సినిమా మార్పు తీసుకువచ్చిన విధానం వంటి విషయాలపై ఇద్దరూ సరదాగా, భావోద్వేగంగా మాట్లాడుకున్నారు. నాగార్జున తన కెరీర్‌లో శివ టర్నింగ్ పాయింట్‌గా మారిందని, ఆర్జీవీతో పనిచేయడం మరచిపోలేని అనుభవమని పేర్కొన్నారు. ఆర్జీవీ కూడా నాగార్జున నటన, అతని రిస్క్ తీసుకునే ధైర్యం వల్లే శివ లెజెండరీ సినిమా అయిందని ఇందులో తెలిపాడు.
Read Also : Nagarjuna – Konda Surekha : కొండా సురేఖకు భారీ ఊరట.. కేసు వాపస్ తీసుకున్న నాగర్జున
