NTV Telugu Site icon

Ram Gopal Varma: క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ తో వర్మ భేటీ.. కారణం అదేనా..?

Varma

Varma

Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ ఎవరు అంటే టక్కున దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పేస్తారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని వివాదాస్పదం చేయడంలో వర్మ తరువాతే ఎవరైనా.. ఇక మొన్నటికి మొన్న సీఎం జగన్ ను కలిస వ్యూహం అనే సినిమాకు నాంది పలికి అందరికి షాక్ ఇచ్చాడు. ఇంకా ఆ సినిమా పనులు మొదలే పెట్టలేదు తాజాగా మరో సంచలనాన్ని సృష్టించాడు. కొద్దీ రోజుల క్రితం ఇండస్ట్రీని వణికించిన చికోటి ప్రవీణ్ తో వర్మ భేటీ అయ్యాడు. ఇటీవల క్యాసినో.. హవాలా రూపంలో డబ్బుల పంపిణీకి సంబంధించిన విషయంలో చికోటి ప్రవీణ్ ను ఈడీ ప్రశ్నించిన విషయం తెల్సిందే. ఈ చికోటి వ్యవహారంలో చాలామంది హీరోయిన్లు, రాజకీయ నేతలు కూడా ఉన్న విషయం తెల్సిందే. అలాంటి వైల్డ్ మ్యాన్ ను వర్మ ఫార్మ్ హౌస్ లో కలిశాడు.

ప్రవీణ్ ఫార్మ్ హౌస్ లో కలిసిన వర్మ అతనితో కొద్దిసేపు ముచ్చటించాడు. ఆ ఫొటోలోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆయన గురించి, అక్కడ ఉన్న జంతువుల గురించి చెప్పుకొచ్చాడు. ఇక సడెన్ గా వీరిద్దరి భేటీ ఎందుకు జరిగింది అనేదానిమీద సర్వత్రా ఆసక్తి కలుగుతోంది. నా వ్యవహారంలో ఎవరైనా జోక్యం చేసుకొంటే అందరి బండారాలు బయటపెడతాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన ప్రవీణ్ నుంచి వర్మ ఎవరి బండారం బయటపెట్టడానికి కలిశాడు. ఈ చికోటి ప్రవీణ్ చీకటి ప్రపంచాన్నీ ప్రేక్షకులకు చూపించే ఆలోచనలో ఉన్నాడా..? మొదటి నుంచి వర్మ కు యాక్షన్ సినిమాలు అంటే బాగా ఇష్టం.. ప్రవీణ్ బయోపిక్ లో ఫుల్ యాక్షన్ ఉండడంతో ఆయన బయోపిక్ మీద ఏమైనా కన్ను వేశాడా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.