Site icon NTV Telugu

RGV : మరో యాంకర్ పై వర్మ కన్ను.. నా కళ్లనుంచి ఎలా తప్పించుకున్నావ్ అంటూ స్టేజిపైనే..

varma

varma

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వరం ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆయనకే తెలియదు. ఇక హీరోయిన్ల విషయంలో ఆయనను ఆపడం ఎవరి వలన కాదు. హీరోయిన్లతో పాటు యాంకర్లను కూడా వదలని వర్మ తనను ఇంటర్వ్యూ చేసిన యాంకర్లను పొగడ్లతో ఆకాశానికెత్తేసి వారిని టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చేశాడు. ఈ వరసలో చెప్పుకోవాలంటే అరియనా, అషూ రెడ్డి, దేవి నాగవల్లి లాంటి యాంకర్లను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చింది వర్మనే చెప్పాలి. ఇక వీరి లిస్ట్ లోకే చేరింది యాంకర్ శ్యామల. తాజాగా కన్నడ హీరో ధనంజయ నటించిన కన్నడ చిత్రం బడవ రాస్కెల్. ఇటీవల పుష్ప సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధనంజయ ఈ సినిమాతో తెలుగులో హీరోగా పరిచయం కానున్నాడు. ఇక ఈ చిత్రం నిర్వహించిన ఒక ఈవెంట్ కి ముఖ్య అతిధిగా వెళ్లిన వర్మ .. శ్యామలపై కన్నేశాడు.

ఆమె గురించి మాట్లాడుతూ”ఇంత అందంగా వున్న మీరు నా కళ్ల నుంచి ఎలా తప్పించుకున్నారు?” అని అనేశాడు. దీంతో స్టేజిపైన ఉన్నవారందరు షాక్ కి గురయ్యారు. ఇక వర్మ అందమైన పొగడ్తలకు శ్యామల సైతం ఫిదా అయిపోయి సిగ్గు పడుతూ మెలికలు తిరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో ఫై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. వర్మ గారు .. ఆమెకు పెళ్ళై ఒక పిల్లడు కూడా ఉన్నాడు అని కొందరు.. పెళ్లైన వారిని కూడా వదలవా నువ్వు అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.

Exit mobile version