NTV Telugu Site icon

RGV: ది కేరళ స్టోరీ సినిమాపై వర్మ రివ్యూ.. ఏమన్నాడంటే..?

Varma

Varma

RGV: సాధారణంగా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు మాట్లాడతాడు అని అభిమానులను అడిగితే .. అయితే వోడ్కా తాగినప్పుడు, లేదా వివాదం చేయాలనుకున్నప్పుడు అని టక్కున చెప్పేస్తారు.సరే, మన దగ్గర వివాదాలు లేకపతే.. వివాదాలు ఉన్న సమస్యలపై స్పందిస్తే సరి.. అనుకొనే టైప్ వర్మ. ఈ మధ్యనే నిజం అనే యూట్యూబ్ ఛానెల్ తో దర్శనమిచ్చి.. అబద్దాలకు బట్టలు ఇప్పదీస్తా.. వివేకా హత్య కేసులో నిజానిజాలు బయటపెడతా అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు అసలు నిజం ఏంటో సినిమాగా తీసి చెప్పు అని అడిగేస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. వర్మ, తాజాగా ది కేరళ స్టోరీ సినిమాపై రివ్యూ చెప్పుకొచ్చాడు. గత మూడు రోజులుగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడు ప్రభుత్వాన్ని గజగజలాడిస్తున్న ఈ సినిమాపై రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Lal Salaam: మొయిద్దీన్ భాయ్ వస్తున్నాడు.. పక్కకు జరగండమ్మా

“తమిళ మరియు మలయాళ హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాత గుజరాతీ, డైరెక్టర్ బెంగాలీ, అందరు కలిసి హిందీలో సినిమా తీస్తే.. అది అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది. ఇది నిజమైన పాన్ ఇండియా సినిమా .. ది కేరళ స్టోరీ” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ చూసిన అభిమానులు.. మొదటిసారి వర్మ పాజిటివ్ గా మాట్లాడడం చూస్తున్నాము అని కొందరు.. కర్ణాటక ఎలక్షన్స్ ప్రభావం అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. అయితే పాన్ ఇండియా అంటున్నాడు అంటే.. బావుందని చెప్తున్నాడు అని అనుకుంటా అని ఇంకొందరు అంటున్నారు. మరి ఈ సినిమా ముందు ముందు ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.