RGV on Chiranjeevi: రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు..ఆ జాతిని మైల్ దూరం పెట్టాలంటూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGV Comments on Chiranjeevi: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలు చేయడం తక్కువైంది వివాదాస్పద ట్వీట్లు, కామెంట్లు చేయడం ఎక్కువైంది. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆయన చేసే ట్వీట్లు అయితే ఎప్పటికప్పుడు మెగా అభిమానులందరికీ ఆగ్రహం తెప్పిస్తూనే ఉంటాయి. తాజాగా భోళా శంకర్ రిలీజ్ విషయంలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు భోళా శంకర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటుంది. సినిమా బాలేదని కొందరు అంటుంటే సూపర్ గా ఉందని మరికొందరు అంటున్నారు.
Bhola Shankar: భోళా శంకర్ సినిమా నిలిపివేత.. థియేటర్ సీజ్
Also Read
అయితే ఈ విషయం మీద రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకులు భజన పొగడ్తలకి అలవాటు పడిపోయి , రియాల్టీ కి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోందని ట్వీట్ చేశారు. అలాగే పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఉండరు… రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు .. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టడమే మంచిదాని అన్నారు. ఇక మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన భోళా శంకర్ సినిమాని ఎట్టకేలకు శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాలో కీర్తి సురేష్, తమన్నా, సుశాంత్ వంటి వారి కీలక పాత్రలలో నటించారు. అమ్మాయిల హ్యూమన్ ట్రాఫికింగ్ విషయాన్ని తెరమీద ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాడు మెహర్ రమేష్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. మరి రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మెగా అభిమానులు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది.
జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి , రియాల్టీ కి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది
— Ram Gopal Varma (@RGVzoomin) August 11, 2023
తాజావార్తలు
-
Rahul Gandhi: నీట్ బాధిత కుటుంబాలకు రాహుల్ గాంధీ ఓదార్పు.. ఎక్స్‌లో ఫొటోలు పోస్ట్
-
Secret Reveal: 46 టన్నుల ఆర్బీఐ బంగారం గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఎలా వెళ్లింది..?
-
Rahul Gandhi: ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్‌పై ఫిర్యాదు.. రాహుల్‌గాంధీతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్
-
Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి.!
-
Alibaba: ప్రముఖ ఈ-కామర్స్ అలీబాబా చైర్మన్ దంపతులు విడాకులు.. 30 ఏళ్ల బంధానికి గుడ్‌బై!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!