Site icon NTV Telugu

ఇది పబ్లిసిటీ: వర్మ బుట్టలో మరో భామ

Ashu with RGV

Ashu with RGV

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్టర్ గా ఎంతటి పాపులారిటీ పొందాడో అందరికి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన ఇంటర్వ్యూలతో అంతకుమించి యూత్ లో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక అప్పుడప్పుడు అల.. వచ్చిపోయే సినిమాలు తీస్తూ, దానికి సంబందించిన ఇంటర్వ్యూలతో పాటు నిత్యం ఏదోవొక కార్యక్రమంతో ఖాళీగా ఉండకుండా ప్రేక్షకుడి మెదళ్లో ఉంటున్నాడు. మరి కుదరకపోతే ట్విట్టర్ లో ఇష్టమైన వారి మీద.. తనకు ఇష్టమైనట్లుగా కామెంట్స్ చేస్తుంటాడు. అయితే, ఈమధ్య కాలంలో వర్మలో మరో కోణం బయటపడింది. అదే బోల్డ్ ఇంటర్వూస్..

నిజానికి, బోల్డ్ సినిమాలు తీసే వర్మకి.. బోల్డ్ ఇంటర్వూస్ చేయడం పెద్ద మ్యాటరే కాదు. అయితే ఈ ఇంటర్వూస్ కి డేర్ చేసి వస్తున్న భామల గూర్చే ప్రస్తుతం మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఇదివరకు ‘అరియానా బోల్డ్ ఇంటర్వ్యూ విత్ ఆర్జీవీ’ తో వచ్చిన ఇంటర్వ్యూ ఎంతటి దుమారం రేపిందో తెలిసిందే. ఆ ఇంటర్వ్యూ పట్ల అరియానా కెరీర్ ఎటు తిరుగుతుందోనని ఆమె కంగారు పడిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఇంటర్వ్యూలో సంభాషణల కంటే, వర్మ పెట్టిన కెమెరా యాంగిల్సే ఎక్కువ కాంట్రవరీ అయింది. సో.. వర్మ అండ్ టీమ్ కి కోరుకున్న పాపులారిటీ వచ్చేసింది. అయితే తాజాగా వర్మ బుట్టలో మరో భామ వచ్చి చేరింది.

అరియానా తరహాలోనే ‘అషూ బోల్డ్ ఆర్జీవీ’ పేరుతో ఓ ఇంటర్వ్యూ రానుంది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను అషు షేర్ చేసింది. ఈ ఇంటర్వ్యూలోను వర్మ పెర్ఫామెన్ భీభత్సంగానే కనిపిస్తోంది. అషు రెడ్డి విషయంలోనూ ఏ మాత్రం డోసు తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నాడు. అయితే ఈ వీడియోకి అషు రెడ్డి పెట్టిన కాప్షన్ కూడా ఆసక్తికరంగా మారింది. ‘నో మీన్స్ నో…’ అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన పని, తనకి ఇబ్బంది కలిగించిందని పరోక్షంగా ప్రకటించింది అషు రెడ్డి. దీనికి వర్మ కూడా తనదైన స్టైల్‌లో స్పందించాడు. ‘నో… అది నేను కాదు, నా ముందున్నది అషు రెడ్డి కాదు. మేం ఇద్దరం ఇంటర్వ్యూ చేయలేదు. కావాలంటే నేను అందరూ దేవుళ్లపై ఒట్టు పెడతాం, కానీ దేవతలపైన కాదు…’ అంటూ ఆయన స్టైల్లో ట్వీట్ చేశాడు.

మరి ఈ ఇంటర్వ్యూతో బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డికి వర్మ ఏమైనా బ్రేక్ ఇస్తాడా.. లేదా మారే మలుపైనా తిరుగుతోందా..? అనేది తెలియాలంటే పూర్తి ఇంటర్వ్యూ వచ్చే దాకా ఆగాల్సిందే..!

View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin)

Exit mobile version