ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరు ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. నాలుగేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ చిత్రం ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ప్రమోషన్స్ ని స్పీడప్ చేశారు రాజమౌళి అండ్ కో. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని ముంబైలో ఖాళి లేకుండా కానిచ్చేస్తున్నారు. ఇంకోపక్క సోషల్ మీడియాలోను సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేసి హల్చల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా ట్రిపుల్ ఆర్ నాలుగవ సింగిల్ “రివోల్ట్ ఆఫ్ భీమ్” రిలీ చేశారు మేకర్స్.. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలే కొడుకో .. మండాలి కొడు కో.. అంటూ సాగిన ఈ పాట ఆద్యంతం భీమ్ జీవితాన్ని అద్దం పడుతోంది. గొండు జాతి కోసం భీమ్ చేసిన త్యాగాన్ని గుర్తుచేశారు. ఇక కీరవాణి సంగీతం.. కాలభైరవ మెస్మరైజ్ వాయిస్ తో ఈ సాంగ్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకొంటుంది. సినిమాలోకి కీలక భావోద్వేగ భరిత పన్నివేశాలని ఎలివేట్ చేసే సందర్భంలో ఈ పాట వస్తుందని సాంగ్ లిరిక్స్ వింటుంటే అర్ధమవుతుంది. చివర్లో పుడమి తల్లికి జన్మ.. మరణమిస్తివిరో అన్న లైన్ వింటుంటే.. భీమ్ యుద్ధంలో వీర మరణం పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.
