Site icon NTV Telugu

Resul Pookutty: ఆర్ఆర్ఆర్ ఒక గే లవ్ స్టోరీ

Resul Pookutty On Rrr

Resul Pookutty On Rrr

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి.. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో సినిమాగా చరిత్రపుటలకెక్కింది. ఇంకా ఈ సినిమా ఎన్నో ఘనతలు సాధించింది. అంతర్జాతీయంగానూ తనదైన ముద్ర వేసింది. అయితే, కొందరికి మాత్రం ఈ సినిమా నచ్చలేదు. కొందరు అజ్ఞానులైతే దీనిని ‘గే సినిమా’గా పేర్కొన్నారు కూడా! ఇప్పుడు అలాంటి వారి జాబితాలో తాజాగా ఆస్కార్ విన్నింగ్ సౌండ్ విజైనర్ రసూల్ పూక్కుట్టి కూడా చేరిపోయాడు. ఈ చిత్రాన్ని ‘గే లవ్ స్టోరీ’గా పేర్కొంటూ సంచలన ట్వీట్ చేశాడు.

తొలుత నటుడు, రచయిత, దర్శకుడు మునీష్ భరద్వాజ్ ‘ఆర్ఆర్ఆర్’ను చెత్త సినిమాగా పేర్కొంటూ ఓ ట్వీట్ చేశాడు. ‘‘నిన్న రాత్రి ఆర్ఆర్ఆర్ అనే ఒక చెత్త సినిమాను చూశాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. అందుకు వత్తాసు పలుకుతూ.. ‘‘ఆర్ఆర్ఆర్ అనేది ఒక గే లవ్ స్టోరీ’’ అని రసూల్ రీట్వీట్ చేశాడు. అంతేకాదు.. ఇందులో ఆలియా భట్, శ్రియా శరన్‌లను బొమ్మలుగా వినియోగించుకున్నారే తప్ప వాళ్లకు ఎలాంటి ప్రాధాన్యత లేదని పేర్కొన్నాడు. ఈ విధంగా రసూల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. భారత సినిమా ఖ్యాతిని వరల్డ్‌వైడ్‌గా చాటిచెప్పిన ఓ వ్యక్తి, ఇలాంటి కామెంట్స్ చేయడం తగునా? అంటూ విమర్శిస్తున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్‌కి మంచి పేరు వస్తుండడం చూసి జీర్ణించుకోలేక అసూయతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రసూల్‌ని తిట్టిపోస్తున్నారు.

మరింత విడ్డూరమైన విషయం ఏమిటంటే.. తన వ్యాఖ్యలు రసూల్ సమర్థించుకోవడం. ‘‘మీరు చేసిన కామెంట్‌తో మీపై గౌరవం పోయింది’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేస్తే.. ‘‘వెస్ట్రన్ దేశాల్లో ఆ చిత్రాన్ని అలానే పిలుస్తున్నారు. నేను దానిని కోట్ చేశాను’’ అని చెప్పుకొచ్చారు. ఈ లెక్క ప్రకారం, సినిమాలపై ఈయన అవగాహన లేదా? సినిమా చూడకుండానే విదేశీయుల అభిప్రాయాన్ని కాపీ కొట్టారా? ఆస్కార్ అవార్డ్ గెలిచిన ఓ వ్యక్తి.. మరీ ఇంత అజ్ఞానిలా సమాధానం ఇవ్వడమేంటో?

Exit mobile version