NTV Telugu Site icon

Renuka Swami Murder: అమ్మో ఇంత టార్చర్ చేశారా? పోస్ట్‌మార్టంలో దొరికిన దర్శన్ గ్యాంగ్.. డాక్టర్లు ఏం చెప్పారంటే?

Renuka Swami Murder Case

Renuka Swami Murder Case

Renuka Swami Murder Case Postmortem Report: చిత్రదుర్గకు చెందిన రేణుక స్వామిపై నటుడు దర్శన్ గ్యాంగ్ దాడి చేయడంతో తలకు బలమైన గాయం తగలడంతో మృతి చెందినట్లు విక్టోరియా ఆస్పత్రి వైద్యుల పోస్టుమార్టం నివేదికలో తేలింది. రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి, విక్టోరియా ఆస్పత్రి టీం కామాక్షిపాళయ పోలీస్ స్టేషన్‌లో పోస్ట్‌మార్టం పరీక్షపై మౌఖిక నివేదికను సమర్పించింది. అందులో రేణుక స్వామి మరణానికి ముఖ్య కారణం తలకు తగిలిన గాయం అని చెబుతున్నారు. రేణుకాస్వామి మృతదేహంపై గాయాల ఆనవాళ్లు కనిపించాయి. అతని మెదడు, ఛాతీ, చేతులు -కాళ్ళు, మెడ మరియు తలపై గాయాలయ్యాయి. మర్మాంగానికి ప్రాణాంతకమైన దెబ్బ తగిలితే, నొప్పితో గుండెపోటుతో చనిపోయాడని అనుకున్నారు కానీ రేణుకాస్వామి తలకు తగిలిన గాయమే ఆయన మృతికి కారణమని సంబంధిత వర్గాలు ‘కన్నడప్రభ’కు తెలిపాయి. బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌లోని పట్టగెరె షెడ్‌లో రేణుకాస్వామిపై నటుడు దర్శన్ గ్యాంగ్ దాడి చేసింది. ఆ సమయంలో తలపై బలమైన దెబ్బ తగిలిన రక్తం కారలేదు.

Renuka Swamy Murder: రేణుకా స్వామి మర్డర్ కేసులో ట్విస్ట్.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన క్యాబ్ డ్రైవర్

దీంతో రేణుకాస్వామి తలలో రక్తం గడ్డకట్టడంతో మృతి చెందాడు. తుది పోస్టుమార్టం నివేదిక సమర్పించిన తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపనున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిపుణులు వెరిఫికేషన్‌ అనంతరం మరణానికి గల కారణాలపై స్పష్టత ఇస్తారని సీనియర్‌ అధికారులు తెలిపారు. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన సినీ నటుడు దర్శన్‌ సహా నిందితుల విచారణ బెంగళూరు అన్నపూర్ణేశ్వరి నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కొనసాగుతోంది. కానీ స్టేషన్ లోపల ఏం జరుగుతుందో తెలియని విధంగా స్టేషన్ చుట్టూ పరదా వేసి స్టేషన్ మొత్తాన్ని దాచి ఉంచారు. దీనిపై పశ్చిమ డివిజన్ డీసీపీ ఎస్.గిరీష్ వివరణ ఇస్తూ.. ‘రేణుకాస్వామి హత్య మామూలు కేసులా కాదు. ఈ కేసు దర్యాప్తులో చాలా ప్రయత్నాలు జరిగాయి. అనేక కోణాల్లో విచారణ జరిపి కేసు పవిత్రతను కాపాడాల్సి ఉంది. కాబట్టి కొన్ని చర్యలు తీసుకొక తప్పడం లేదు, విచారణ విషయం బయటపెట్టలేమని అన్నారు.