Site icon NTV Telugu

Renu Desai: అది పాపపు సొమ్ము, మీరందరూ అనుభవస్తారు..యూట్యూబర్లపై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

Renu Desai

Renu Desai

కొంత మంది యూట్యూబర్లపై ప్రముఖ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ విరుచుకుపడ్డారు. “అందరూ రెండు రోజుల నుంచి నా పేరు మీద వీడియోలు చేసి యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు. గుర్తుంచుకోండి, ఆ డబ్బు శపించబడ్డ సొమ్ము. మీరు కచ్చితంగా అనుభవిస్తారు. మీకు నిజంగా టాలెంట్ ఉంటే ఒరిజినల్ కంటెంట్ చేయండి, మిగతా వాళ్ల మీద యూట్యూబ్‌లో వీడియోలు చేయడం ఆపండి.

Also Read:Dhurandhar 2 : ‘ధురంధర్ 2’లోకి మరో బాలీవుడ్ స్టార్ హీరో ఎంట్రీ? ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా..

నిజంగా మీకు టాలెంట్ ఉంటే కనుక ఇతరుల మీద పడి బతకకుండా మీ అంతటి మీరుగా కంటెంట్ క్రియేట్ చేయండి. బుద్ధి తక్కువ ఉంటేనే ఒరిజినల్ కంటెంట్ రాదు. మీరు లావుగా ఉన్న నల్ల మైకులు పెట్టుకొని పాడ్‌కాస్ట్‌లు చేస్తూ, వీధిలో ఉన్న ముసలి వాళ్లు గాసిప్ చెప్పుకున్నట్టుగా సెలబ్రిటీలను ట్రోల్ చేస్తూ, అంబానీలను చేస్తూ, పొలిటీషియన్లను చేస్తూ వస్తున్నారు. ఒకవేళ ఇండియాలో ఉన్న సెలబ్రిటీలు, పొలిటీషియన్లు, బిజినెస్‌మెన్ అందరూ మాయమైపోతే మీరు ఏ వీడియోలు చేసి డబ్బులు సంపాదిస్తారు?

Also Read:Nidhi Agerwal : ఇండస్ట్రీ నెగిటివ్ క్యాంపెయిన్‌పై.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!

మీకు ఒరిజినల్, జెన్యూన్ టాలెంట్ ఏమీ లేదు. ప్రొఫెషనల్ వెటకారం, అనవసరమైన నాన్సెన్స్‌తోనే బతుకుతున్నారు” అంటూ ఆమె కొంతమంది యూట్యూబర్ల మీద విరుచుకుపడింది. కుక్కల్ని చంపేస్తున్నారు అంటూ కొద్ది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టిన రేణు దేశాయ్, అందులో మాట్లాడిన మాటల వల్ల ట్రోల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ముందుకు వచ్చి ఈ మేరకు కామెంట్లు చేయడం గమనార్హం.

Exit mobile version