NTV Telugu Site icon

Renu Desai: చెప్పాల్సింది పవన్ కే చెప్పా.. ఇక చెప్పేదేం లేదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan Vs Renu Desai

Pawan Kalyan Vs Renu Desai

Renu Desai Crucial Comments on Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన కామెంట్ చేశారు. తాజాగా తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తో కుమారుడు అకీరా నందన్ ప్రధానమంత్రి మోదీని కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోల కింద వస్తున్న కామెంట్లకు సైతం స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ అంతా ఓకే గాని కళ్యాణ అన్న గురించి కూడా ఏమన్నా చెప్పొచ్చుగా వదిన. చాలా మంది వెయిటింగ్, ఏమైనా చెప్తారా? బట్ మీరు ఏ పోస్ట్ లోనూ చెప్పట్లేదు. మూడు రోజుల నుంచి అంటూ పవన్ కళ్యాణ్ గురించి స్పందించమని ఒకరు అడిగారు. అయితే నేను ఏదైనా చెబితే ప్రతి ఒక్కరు నేను అటెన్షన్ కోసం చెప్పానని అంటారు. అయితే నేను చెప్పాల్సింది ఏంటో ఆయనకు డైరెక్ట్ గా ఫోన్ కాల్ లో చెప్పేశాను.

Renu Desai: నా హృదయం నిండిపోయింది.. కళ్ళు మెరిసిపోయాయి.. రేణు దేశాయ్ ఎమోషనల్

మీరు హ్యాపీగా ఉండొచ్చు అంటూ ఆమె కామెంట్ చేసింది. ఇక అఖిరా నందన్ హైట్ ఎంత అనే విషయాన్ని కూడా ఆమె ఈ పోస్ట్ లోనే వెల్లడించింది. అకిరా నందన్ ఆరడుగుల 4 అంగుళాలు ఉంటాడని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే అకిరా నందన్ అంత హైట్ అవ్వడానికి కాంప్లాన్ ఎన్నిసార్లు ఇచ్చారు అని అడిగితే ఇప్పటివరకు అసలు కాంప్లాన్ అనేది తాగలేదని ప్యూర్ గా వెజిటేరియన్ ఫుడ్ తింటాడని అది కూడా ఇంట్లో పండించిన ఆర్గానిక్ కూరగాయల తోనే తింటాడని, ఇద్దరు తల్లిదండ్రుల నుంచి వచ్చిన జెనెటిక్స్ కూడా అంత హైట్ రావడానికి ఉపయోగపడ్డాయని ఆమె కామెంట్ చేసింది. అలాగే ఈ ఫోటోలో ఆద్య మిస్సయిందని అంటే ఆమెకు స్కూలు మొదలైంది కాబట్టి ఆ రోజు ఆమె వెళ్లలేకపోయిందని రేణు చెప్పుకొచ్చింది.

Show comments