Site icon NTV Telugu

Emergency: కంగనాకు సెన్సార్ బోర్డ్ షాక్.. “ఎమర్జెన్సీ” విడుదల వాయిదా..?

Emergency

Emergency

Emergency: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కొత్త సినిమా ‘‘ఎమర్జెన్సీ’’ వివాదాస్పదమవుతోంది. ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన పాలనలో విధించిన ‘ఎమర్జెన్సీ’ ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. అయితే, ఇందులో సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి చెడుగా చూపించే కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆ వర్గం సినిమాని వ్యతిరేకించడంతో వివాదం నెలకొంది.

Read Also: Kolkata Rape Case: కోల్‌కతాలో కొనసాగుతున్న నిరసనలు.. పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు

ఈ సినిమాకు ఇంకా సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ప్రతీ వర్గం యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకుంటామని సెన్సార్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ సినిమాకు మరిన్ని కట్స్‌ని బోర్డు కోరినట్లు తెలుస్తోంది. నిజానికి సినిమాని సెప్టెంబర్ 6న విడుదల చేయాల్సి ఉంది. దీంతో బోర్డు మర్ని కోతలని కోరడంతో సినిమా విడుదల వాయిదా పడింది.

ఈ చిత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సోమవారం కంగనా, చిత్ర బృందంతో రేపు సమావేశం కానుంది. శుక్రవారం ఎక్స్ వేదికగా ఈ సినిమాపై వస్తున్న వివాదాలపై కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ హత్య, పంజాబ్ అల్లర్ల వంటి కొన్ని చారిత్రక సంఘటనలు, వ్యక్తులను చిత్రీకరించకూడదని సెన్సాన్ సభ్యులను బెదిరించడం వల్లే సర్టిఫికేట్ ప్రక్రియ ఆగిపోయిందని ఆమె ఆరోపించారు. ఈ చిత్రంపై అకల్ తఖ్త్ మరియు శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) వంటి సిక్కు సంస్థల నుండి బలమైన ప్రతిస్పందనలు వచ్చాయి. ఎమర్జెన్సీ ట్రైలర్‌లో ఖలిస్తాన్ ఉద్యమకారుడు దివంతగ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే ఉన్నట్లు చూపించడంతో వివాదం చెలరేగింది.

Exit mobile version