Site icon NTV Telugu

Prabhas: ‘ఆదిపురుష్’ రిలీజ్ వాయిదా.. ఇదుగో క్లారిటీ

Prabhas

Prabhas

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. కృతి సనన్ సీతగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి వివాదాల మధ్య చిక్కుకున్న విషయం విదితమే. ఇక ఈ సినిమాను మొదటి నుచ్న్హి సంక్రాంతి బరిలో దించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అనుకున్నట్లుగానే సంక్రాంతి బరిలో ఆదిపురుష్ ఉండనున్నదని ప్రకటించారు కూడా. అయితే గత రెండు రోజుల నుంచి ఆదిపురుష్ వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు గురి అవుతున్నారు.

సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, ఏజెంట్ సినిమాలు బరిలో నిలుస్తుండగా.. వాటితో పోటీ ఎందుకు అని ఆదిపురుష్ వెనక్కి తగ్గింది అని అంటున్నారు. ఇక ఈ వార్తలపై ఈ సినిమా నిర్మాత స్పందించాడు. సంక్రాంతి బరిలో ఎంతమంది ఉన్నా ఆదిపురుష్ వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. ఆదిపురుష్ జనవరి 12 న అన్ని భాషల్లో రిలీజ్ అవ్వడం ఖాయమని తెలిపారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సంక్రాంతి పోరులో నిలిచి గెలిచేదెవరు అనేది చూడాలి.

Exit mobile version