Site icon NTV Telugu

Regina Cassandra : దాని కోసం రాత్రికి రాత్రే ప్రెగ్నెంట్‌ అయ్యా..

Rejina Kasandra

Rejina Kasandra

దక్షిణాది ప్రేక్షకులకు బ్యూటీఫుల్ హీరోయిన్ రెజీనా కాసండ్రా గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ‘శివ మనసులో శృతి’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. అనతి కాలంలోనే తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్పటి నుంచి టాలీవుడ్, కోలీవుడ్ రెండింటిలోనూ వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల ఆమె “విదాముయార్చి” (తమిళం), “జాట్” (హిందీ), “కేసరి చాప్టర్ 2” (హిందీ) వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక సినిమాల్లో మాత్రమే కాకుండా, సోషల్ మీడియా లోనూ తన అందం, స్టైల్‌తో ఎప్పుడు ట్రెండ్ లోనే ఉంటుంది రెజీనా. అయితే ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : Pawan kalayan : పవన్ కళ్యాణ్ – లోకేష్ కాంబినేషన్ ఫిక్స్..!

ఫుడ్ అంటే ప్రాణం అంటూ రెజీనా ఒక ఫన్నీ, షాకింగ్ అనుభవాన్ని షేర్ చేసింది..  ‘ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం కానీ.. ఏం తినాలో, ఎంత తినాలో, ఎప్పుడు తినాలో నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మంచి ఫుడ్ ఉంటే ఎక్కడికైనా వెళ్లిపోతా. అలా ఓ రోజు బెంగళూరులో నాకు చాలా ఇష్టమైన ‘మిష్టి దోయ్’ (Bengali Sweet) తినాలనిపించి చాలా చోట్ల స్వీట్ షాప్ లో తిరిగా ఎక్కడా దొరకలేదు. చివరికి ఒక షాప్‌లో అది కనిపించింది కానీ అప్పటికే షాప్ మూసే టైమ్ అయిపోయింది. సేల్స్ బాయ్ ‘ఇప్పుడే షాప్ క్లోజ్ అయిపోయింది, సర్వ్ చేయలేం’ అని చెప్పాడు. దీంతో ఏం చేయాలో తెలీకా నేను ప్రెగ్నెంట్ .. నాకు ఈ స్వీట్ తినాలని చాలా కోరికగా ఉంది అని అబద్ధం చెప్పేశా. అంతే షాప్‌కీపర్ వెంటనే షాప్ మళ్లీ ఓపెన్ చేసి నాకు స్వీట్ ఇచ్చాడు. ఆ మిష్టి దోయ్ కోసం అలా చెప్పాల్సి వచ్చింది’ అంటూ రెజీనా నవ్వుతూ చెప్పింది. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version