NTV Telugu Site icon

Rebel Star Krishnam Raju Passes Away Live:రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత

Rebelstar 1

Maxresdefault (1)

Live: రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత | Rebel star Krishnam Raju Passes Away | Ntv

రెబల్ స్టార్ కృష్ఱంరాజు మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా పోస్ట్ కోవిడ్ ఇబ్బందులతో ఆయన బాధపడుతున్నారు. గచ్చిబౌలిలోని ఆసియాన్ ఇనిసిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో ఆయన చికిత్స అందుకుంటూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. డయాబెటిస్, కరోనరీ హార్ట్ డీసీజ్ తో ఇబ్బందిపడిన కృష్ణం రాజు. కృష్ణం రాజు గుండె కొట్టుకునే వేగంతో చాలా కాలంగా సమస్య వుందని హెల్త్ బులిటిన్ లో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

రక్త ప్రసరణలో సమస్యతో గతేడాది కాలుకి శాస్త్ర చికిత్స చేయించుకున్నారు కృష్ణం రాజు. దీర్ఘ కాలిక కిడ్నీ , ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న కృష్ణం రాజు.పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5 వ తేదీన ఆసుపత్రిలో చేరిన కృష్ణం రాజు.  మల్టి డ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర న్యూమోనియా  ఉన్నట్టు గుర్తించారు డాక్టర్లు. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు వైద్యులు. ఉదయం గుండెపోటుతో మృతి చెందారు కృష్ణం రాజు..అంటూ ఏఐజీ  హెల్త్ బులెటిన్ విడుదలచేసింది.