NTV Telugu Site icon

The Goat Life: “ది గోట్ లైఫ్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రభాస్

The Goat Life

The Goat Life

Prabhas Unveils First Look Poster of Prithviraj Sukumaran’s The Goat Life: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న కొత్త సినిమా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించగా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. తన స్నేహితుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కు, “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) మూవీ టీమ్ కు ప్రభాస్ తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ – నా ఫ్రెండ్ ప్రభాస్ చేతుల మీదుగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవడం హ్యాపీగా ఉంది.

Devaki Nandana Vasudeva: ‘దేవకి నందన వాసుదేవా’ అంటున్న మహేష్ మేనల్లుడు

ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది అనేది నాకు తెలుసు, ఐదేళ్ల లైఫ్ ను “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా కోసం కేటాయించా. మానసికంగా, శారీరకంగా నజీబ్ క్యారెక్టర్ లా మారిపోయా, ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ మూవీ కోసం రాజీ లేకుండా కష్టపడ్డా అని అన్నారు. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాకు పనిచేస్తున్నప్పుడు మేము ఎంతగా ఎంజాయ్ చేశామో, రేపు థియేటర్స్ లోనూ ప్రేక్షకులు కూడా అంతే హ్యాపీగా ఫీలవుతారని చెప్పారు. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు, పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా కావడం విశేషం. ఇక శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్, మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.