మాస్ మహారాజా రవితేజ పారితోషికంలో నిక్కచ్చిగా ఉంటాడని ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే.. కొన్ని సినిమాలను ఆయన కేవలం డబ్బు కోసమే ఒప్పుకున్నారని టాక్ కూడా ఉంది. ఇక ఈ పారితోషికం విషయంలోనే రవితేజకు మేకర్స్ కు చాలా సార్లు వివాదాలు జరిగాయని చాలామంది బాహాటంగానే చెప్పుకొచ్చారు. మొన్నటికి మొన్న ఖిలాడీ సినిమా విషయంలో కూడా రవితేజకు, డైరెక్టర్ కు, నిర్మాతకు మధ్య పెద్ద గొడవే జరిగిందని వార్తలు గుప్పుమన్నాయి. ఆ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా రవితేజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు కూడా.. సినిమా రిలీజ్ అవ్వకముందే ఒక డైరెక్టర్ కు నిర్మాత కారు కొనడం ఇక్కడే చూస్తున్నా అని, ఇలాంటి నిర్మాతలు ఉండడం చాలా గ్రేట్ అన్నట్లు కొద్దిగా వెటకారంగా రవితేజ మాట్లాడడం.. దానిపై పెద్ద చర్చ జరగడం కూడా తెలిసిందే. అయితే రవితేజ పారితోషికం పెంచమని అడగడంతో నిర్మాతలు కుదరదు అని అన్నారని, హీరో పారితోషికం గురించి పట్టించుకోకుండా డిర్క్ తొర కు కారు కొనడం ఏంటని రవితేజ గొడవపడినట్లు ఇన్ సైడ్ టాక్..
ఇక ఇప్పుడు మరోసారి ఇదే సన్నివేశం రామారావు ఆన్ డ్యూటీ నిర్మాతలకు రిపీట్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రానున్న ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తుండగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మరియు ఆర్టీ వర్క్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నా.. సినిమా మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది. ఇప్పటికే మూడు సార్లు రిలీజ్ డేట్ వెనక్కెళ్లి పోయింది. ఈ సినిమాను ముందుగా ఒకేసారి మార్చి 25న కాని, ఏప్రిల్ 14న గాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మార్చి 25న ఆర్ఆర్ఆర్ , ఏప్రిల్ 14న ‘కెజిఎఫ్ 2’ లాంటి భారీ సినిమాలు వస్తూ ఉండడంతో వాటితో పోటీ ఎందుకని ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూన్ 17 ను పిక్స్ చేసుకుంది. ఇక రిలీజ్ డేట్ ప్రకటించాకా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన ఈ సినిమా మళ్లీ పోస్ట్ ఫోన్ అయ్యింది. ఈసారి ఈ వాయిదా కారణం మాత్రం రవితేజనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.. కొన్ని రోజుల నుంచి రవితేజకు, నిర్మాతకు మధ్య విభేదాలు తలెత్తాయని టాక్ వినిపిస్తోంది. అవి ఏంటి అంటే.. సినిమా మొదలుకాకముందే హీరోకు, నిర్మాతకు డైరెక్టర్‌ల మధ్య ఒప్పందం జరిగిందట.
బిజినెస్ పరంగానూ థియేట్రికల్, శాటిలైట్, ఓటిటి, ఇతర హక్కులకు సంబంధించి మంచి బిజినెస్ జరిగితే అందులో రవితేజకు వాటా ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారట.. ఇక అనుకున్నదానికంటే ఈ సినిమా బిజినెస్ పరంగానూ థియేట్రికల్, శాటిలైట్, ఓటిటి, ఇతర హక్కులకు సంబంధించి మంచి బిజినెస్ జరిగింది. దాంతో రవితేజ తన వాటా ఇవ్వమని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే నిర్మాత మాత్రం బిజినెస్ అయిన మాట వాస్తవమే కానీ డబ్బులు ఇంకా చేతికి రాలేదని, సినిమా రిలీజ్ అయ్యాకా ఇస్తానని చెప్పడంతో రవితేజ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టాక్. దీంతో ఇద్దరి మధ్య కాస్తా విభేదాలు తలెత్తాయని, అందుకే పోస్ట్ ప్రొడక్షన్‌లు పనులు వాయిదా పడ్డట్లు సమాచారం. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
