Site icon NTV Telugu

VD11 : మూవీ లాంచ్ లో సామ్ మిస్సింగ్… ఎందుకంటే ?

Samantha

Samantha

తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్న సమంత మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజు సామ్, విజయ్ దేవరకొండ జంటగా నటించబోతున్న కొత్త చిత్రం మూవీ లాంచ్ జరిగింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా లాంచ్ లో విజయ్ దేవరకొండతో పాటు శివ నిర్వాణ, హరీష్ శంకర్, బుచ్చిబాబు వంటి దర్శకులు కన్పించారు. అయితే సామ్ మాత్రం ఎక్కడా కన్పించలేదు. దీంతో సామ్ తన సినిమా లాంచ్ కు ఎందుకు హాజరు కాలేదనే అనుమానం వచ్చింది చాలామందికి. ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. సమంత ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో వెకేషన్ నుంచి ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం సామ్ తన సోదరితో కలిసి వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లింది.

Read Also : Kajal Aggarwal : తల్లయ్యాక ఫస్ట్ పోస్ట్… వైరల్

ఇక సామ్ సినిమాల విషయానికొస్తే… విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా “కాతు వాకుల రెండు కాదల్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సామ్ తో పాటు విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రల్లో కన్పించనుండగా, ఏప్రిల్ 28 న విడుదల కానుంది. ఇక ఆమె ఖాతాలో శాకుంతలం, యశోద, సిటాడెల్ అనే బాలీవుడ్ మూవీ, అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాలీవుడ్ మూవీ ఉన్నాయి. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఆమె చేయనున్న రెండవ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ఇంతకుముందు శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘మజిలీ’ అనే బ్లాక్ బస్టర్ మూవీలో సామ్ కన్పించింది.

Exit mobile version