Reason behind our children’s names:Ashwini Dutt
సమ్మక్క – సారలమ్మ మీద ఉన్న భక్తితోనే తమ పిల్లలకు స్వప్న, స్రవంతి, శేషు ప్రియాంక అనే పేర్లు పెట్టానని, డాక్టర్ అయిన తన బావమరిదికి సమ్మక్క – సారమ్మ అంటే ఎంతో భక్తి అని సీనియర్ నిర్మాత అశ్వినీదత్ చెప్పారు. సమ్మక్క – సారలమ్మను కోట్లాదిమంది భక్తితో మొక్కుతారని, వాళ్ళను చిన్న జీయర్ స్వామి విమర్శించడం తనకు నచ్చలేదని అన్నారు.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని పల్లెల్లో దారుణంగా మత మార్పిడిలు జరుగుతున్నాయని, వాటిని ఏ స్వామీజీ కూడా పట్టించుకోవడం లేదని, అప్పట్లో తిరుపతిలో వేయి కాళ్ళ మండపాన్ని కూల్చేసినప్పుడు ప్రతి వారం ప్రెస్ మీట్ పట్టి విమర్శించిన చిన్న జీయర్ స్వామి… ఇవాళ తిరుపతి లో ఇన్ని దారుణాలు జరుగుతుంటే మాట్లాడటం లేదని అశ్వనీదత్ విమర్శించారు. పైగా సీఎం జగన్ ను దైవాంశసంభూతుడని పొగుడుతున్నారని వాపోయారు
