Reason behind Nithin Attending VarunLav Wedding: టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం జరిగి దాదాపు నెలరోజులు కావస్తోంది. నవంబర్ 1 న ఇటలీలో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ జంట పెళ్ళికి మెగా హీరోలు మినహా బయటి వారిని ఎవరినీ పిలాభాలేదు. అయితే ఈ పెళ్ళిలో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు, కుటుంబ సభ్యలతో పాటు హీరో నితిన్ జంట కూడా కనిపించారు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయిన హీరో నితిన్ ఈ పెళ్ళికి ఎందుకు హాజరయ్యాననే విషయం మీద క్లారిటీ ఇచ్చారు. నిజానికి నితిన్ అక్కడ ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే, మెగా ఫ్యామిలీ, హీరోలు, సన్నిహితులు తప్ప మరెవ్వరికీ ఈ పెళ్లికి ఆహ్వానం అందలేదు.
Mahesh Babu: మహేష్ టీ షర్ట్ .. చూడడానికే సింపుల్.. కొనడం మన వల్ల కాదు మావా
ఇక ఇదే విషయం గురించి మాట్లాడుతూ, గత 6-7 ఏళ్లుగా వరుణ్ తేజ్‌తో తనకు ఈ క్లోజ్ బాండింగ్ ఉందని నితిన్ వెల్లడించాడు. ఈ విషయం బయట వారికి తెలియదేమో కానీ మేము చాలా క్లోజ్ దాదాపుగా రోజు విడిచి రోజు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటామని ప్రతివారం క్రమం తప్పకుండ కలుస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక అలా కలిసినపుడు అనేక రకాల అంశాల గురించి కూడా చర్చిస్తామని చెప్పుకొచ్చారు. నితిన్ తన భార్య షాలినితో కలిసి వరుణ్ వివాహానికి హాజరై అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నాడు. మరోవైపు, వరుణ్ తేజ్ ఇటీవల గందీవధార అర్జునతో డిజాస్టర్ సాధించగా ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. నితిన్ కూడా ‘మాచర్ల నియోజక వర్గం’ ఫ్లాప్ తర్వాత ‘ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.